ఆ క్యాచ్‌ చూస్తే.. వారెవ్వా అనాల్సిందే.. ! | Sakshi
Sakshi News home page

ఆ క్యాచ్‌ చూస్తే.. వారెవ్వా పాండ్యా అనాల్సిందే.. 

Published Wed, Nov 1 2017 9:27 PM

  Hardik pandya stunning catch in India Vs New Zealand match - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇండియా- న్యూజిలాండ్‌ తొలి టీ-20లో పాండ్యా అద్భుతమైన క్యాచ్‌ పట్టుకున్నాడు. చాహాల్‌ ఓవర్లో మార్టిన్‌ గుఫ్టిల్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగ్‌లో ఉన్న హర్ధిక్‌ పాండ్యాకు దొరికిపోయాడు. బౌండరీ దగ్గర్లో ఉన్న పాండ్యా పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్‌ చేసి బంతిని అందుకున్నాడు. పాండ్యా మ్యాజిక్‌తో న్యూజిల్యాండ్‌ ఓపెనర్‌ గుప్టిల్‌ వెనుదిరగడంతో అభిమానుల ఆనందానకి అవధులు లేకుండా పోయాయి.

తొలుత టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో ఓపెనర్లు శిఖర్ ధావన్ (51 బంతుల్లో80: 9ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ(55 బంతుల్లో 80: 6 ఫోర్లు, 4 సిక్సర్లు ) హాఫ్ సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ భారీ స్కోరు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీం ఇండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 203 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.  కివీస్ బౌలర్లలో సోదీ 2 వికెట్లు, బౌల్ట్ కు ఓ వికెట్ దక్కాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement