ఐదో వన్డే: భారత్ లక్ష్యం 287 | Sakshi
Sakshi News home page

ఐదో వన్డే: భారత్ లక్ష్యం 287

Published Sun, Nov 16 2014 4:53 PM

ఐదో వన్డే: భారత్ లక్ష్యం 287 - Sakshi

రాంచీ: భారత్తో ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం జరుగుతున్న చివరి మ్యాచ్లో శ్రీలంక 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక.. మాథ్యూస్ (116 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 139 నాటౌట్) సూపర్ సెంచరీతో చెలరేగడంతో  పూర్తి ఓవర్లలో8 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. మాథ్యూస్ సెంచరీతో పాటు తిరుమన్నె (52) హాఫ్ సెంచరీతో రాణించి జట్టును ఆదుకున్నారు.

 కాగా లంక ఆరంభంలో కష్టాల్లోపడింది. భారత బౌలర్ల ధాటికి లంక బ్యాట్స్మెన్ డిక్వెల్లా (4), దిల్షాన్ (35), చాందిమల్ (5), మహేల (32) తక్కువ పరుగులకే అవుటయ్యారు. ఈ సమయంలో మాథ్యూస్, తిరుమన్నె ఐదో వికెట్కు 128 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి లంకను ఆదుకున్నారు. తిరుమన్నె అవుటయినా మాథ్యూస్ అదే జోరు కొనసాగించాడు. భారత బౌలర్లు కులకర్ణి మూడు, అక్షర్ పటేల్, అశ్విన్ రెండేసి వికెట్లు తీశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement