ఏబీ డివిలియర్స్ ..ఓ కొత్త షాట్ | Sakshi
Sakshi News home page

ఏబీ డివిలియర్స్ ..ఓ కొత్త షాట్

Published Thu, Mar 9 2017 3:22 PM

ఏబీ డివిలియర్స్ ..ఓ కొత్త షాట్

హామిల్టన్: నిస్సందేహంగా ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్ అతనే అని దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ గురించి గతంలో మన క్రికెటర్ విరాట్ కోహ్లి చెప్పిన మాట ఇది. కేవలం క్రికెట్ పుస్తకాల్లో షాట్లకు మాత్రమే పరిమితం కాకుండా బ్యాటింగ్ లో విన్నూత్న ప్రయోగాలను చేయడం డివిలియర్స్ ప్రత్యేకత.  అందుకే స్టార్ క్రికెటర్లకే స్టార్ అయ్యాడు డివిలియర్స్.

రివర్స్ స్వీప్, అప్పర్ కట్.. మనకు బాగా తెలిసిన ఈ రెండు షాట్లను ఆడటంలో డివిలియర్స్ సిద్ధ హస్తుడు.  ఈ రెండింటిని  తానే కనిపెట్టాను అన్నంత  ఈజీగా వాటిని ఆడేస్తుంటాడు.  ఇదిలా ఉంచితే, గతవారం న్యూజిలాండ్ తో జరిగిన నాల్గో వన్డే సందర్భంగా డివీ ఒక షాట్ ఆడాడు.  న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ బోల్డ్ వేగంగా వేసిన బంతిని సునాయాసంగా రివర్స్ షాట్ ఆడాడు డివీ. ఆ షాట్ పేరు ఏమిటో తెలియదు కానీ, డివిలియర్స్ ఆడితే  కొ్త్తగా అనిపించింది. ఇంతకుముందు ఎన్నడూ చూడని ఆ విన్నూత్న షాట్  రివర్స్ స్కూప్ ను పోలి ఉండటంతో అలానే నామకరణం చేశారు క్రికెట్ విశ్లేషకులు. క్రికెట్ లో 'సూపర్ మ్యాన్', మిస్టర్ 360 అని పిలుచుకుని డివిలియర్స్  ఆడిన ఈ కొత్త షాట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. దీనిపై క్రికెట్ అభిమానులు తెగ చర్చించుకోవడమే కాదు, డివిలియర్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొంతమంది అయితే ఈ షాట్ కు ఏమని పేరు పెడదాం అంటూ డివిలియర్స్ బ్యాటింగ్ పై అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement