ఫస్ట్ బ్యాటింగ్ సౌతాఫ్రికాకు ప్లస్సే | Sakshi
Sakshi News home page

ఫస్ట్ బ్యాటింగ్ సౌతాఫ్రికాకు ప్లస్సే

Published Tue, Mar 24 2015 9:02 AM

advantage to south africa to select bat first

న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకోవడం దక్షిణాఫ్రికాకు ప్లస్ అవుతుందని క్రికెట్ అభిమానులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మ్యాచ్ జరిగేది న్యూజీలాండ్లో కానందున సౌతాఫ్రికాకు ప్లస్ అవుతుందని, అదే విజయం సాధిస్తుందని చెప్పారు. ఈ ప్రపంచ కప్లో తొలుత బ్యాటింగ్ తీసుకున్న దేశాలే విజయాలు సాధించాయని వాళ్లుచెప్పుకొచ్చారు.

టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకున్న అనంతరం తన నిర్ణయం సరైనదేనా అని సాక్షి.. ఫేస్బుక్ ద్వారా క్రికెట్ అభిమానులను ప్రశ్నించగా ఈ అభిప్రాయాలను వెల్లడించారు. మరికొందరు మాత్రం న్యూజీలాండ్ టార్గెట్ ను పూర్తి చేస్తుందని, లక్ష్యాన్ని ఛేదిస్తుందని తెలిపారు. ఎక్కువ మంది మాత్రం ఈ మ్యాచ్లో దక్షిణాప్రికాదే విజయం అనే అభిప్రాయం వెల్లడించారు.

Advertisement
Advertisement