తొలిసారి టాప్ టెన్లో.. | Sakshi
Sakshi News home page

తొలిసారి టాప్ టెన్లో..

Published Mon, Dec 28 2015 4:47 PM

తొలిసారి టాప్ టెన్లో..

షార్జా: పసికూన ఆఫ్ఘనిస్తాన్ వన్డేల్లో తొలిసారి టాప్ -10 లో చోటు సంపాదించింది. గత నాలుగు రోజుల క్రితం జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో 49 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆప్ఘనిస్తాన్ తన ర్యాంకును కూడా మరింత మెరుగుపరుచుకుంది. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ రెండు ర్యాంకులు పైకి ఎగబాకి 10 ర్యాంకుకు చేరింది.

 

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో ఆప్థనిస్తాన్ మొదటిసారి టాప్ టెన్ లో స్థానం సంపాదించగా, జింబాబ్వే మరింత కిందికి పడిపోయింది.   ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్  ను ఆప్ఘనిస్తాన్ కైవసం చేసుకుంటే 10వ ర్యాంకు పదిలంగా ఉంటుంది. ఒకవేళ సిరీస్ ను కోల్పోయిన పక్షంలో తిరిగి  12 వ ర్యాంకుకు చేరుతుంది. ఆప్ఘనిస్తాన్ తరువాతి స్థానాల్లో ఐర్లాండ్, జింబాబ్వేలు నిలిచాయి.

Advertisement
Advertisement