విండీస్‌కు అఫ్గానిస్తాన్‌ షాక్‌ | Sakshi
Sakshi News home page

విండీస్‌కు అఫ్గానిస్తాన్‌ షాక్‌

Published Fri, Mar 16 2018 2:35 AM

Afghanistan Shock To West Indies - Sakshi

హరారే: ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ సూపర్‌ సిక్స్‌ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన పోటీలో అఫ్గానిస్తాన్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. లీగ్‌ దశలో కేవలం ఒక్క విజయంతో సూపర్‌ సిక్స్‌కు అర్హత సాధించిన అఫ్గాన్‌ ఈ మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో విజయం సాధించింది. తొలుత విండీస్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. హోప్‌ (43), శామ్యూల్స్‌ (36; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా... గేల్‌ (1) సహా మిగతావారు విఫలమయ్యారు. ప్రత్యర్థి బౌలర్లలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ముజీబుర్‌ రహమాన్‌ 3, నబీ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బరిలో దిగిన అఫ్గాన్‌ 47.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసి గెలిచింది. రెహ్మత్‌ షా (68; 5 ఫోర్లు, 1 సిక్స్‌), నబీ (31; 2 ఫోర్లు) రాణించారు. విండీస్‌ బౌలర్లలో హోల్డర్‌ 3, పాల్‌ 2 వికెట్లు పడగొట్టారు. మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 73 పరుగుల తేడాతో యూఏఈపై గెలుపొందింది. నేడు జింబాబ్వే, ఐర్లాండ్‌ల మధ్య సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌ జరుగనుంది. 

తొలిసారి నేపాల్‌కు వన్డే హోదా... 
మరోవైపు ఇదే టోర్నీ ప్లే ఆఫ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌ 6 వికెట్ల తేడాతో పపువా న్యూ గినియాపై గెలుపొందింది. ఈ విజయం ద్వారా నేపాల్‌ తొలిసారి వన్డే హోదా సాధించింది. అంతకుముందు పపువా న్యూ గినియాకు ఉన్న వన్డే హోదా ఈ ఓటమితో నేపాల్‌కు దక్కింది.

Advertisement
Advertisement