ఎట్టకేలకు రహానే | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు రహానే

Published Sun, Sep 3 2017 2:59 PM

ఎట్టకేలకు రహానే - Sakshi

కొలంబో: భారత్ తో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. రెండో వన్డేల్లో స్లో ఓవర్ రేట్ కారణంగా గత రెండు వన్డే మ్యాచ్ ల నిషేధానికి గురైన శ్రీలంక కెప్టెన్ ఉపుల్ తరంగా ఆఖరి వన్డేలో జట్టుతో కలిశారు. టాస్ గెలిచిన తరంగా తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపారు. ఇదిలా ఉంచితే, లంకేయులతో ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా ఇప్పటివరకూ ఒక్క వన్డే కూడా ఆడని భారత కీలక ఆటగాడు అజింక్యా రహానే చివరి మ్యాచ్ లో చోటు కల్పించారు. ఇప్పటివరకూ రిజర్వ్ బెంచ్ కే పరిమితమైన రహానే.. ఆఖరి వన్డేకు శిఖర్ ధావన్ గైర్హాజరీ కావడంతో ఎట్టకేలకు చోటు దక్కించుకున్నాడు. మరొకవైపు కేదర్ జాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్ లు జట్టుతో కలిశారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా, లోకేశ్ రాహుల్, అక్షర్ పటేల్ కు విశ్రాంతి నిచ్చారు.


వరుసగా నాలుగు వన్డేల్లో విజయం సాధించి లంకపై తిరుగులేని ఆధిక్యం సాధించిన విరాట్ సేన.. మరో గెలుపుతో వన్డే సిరీస్ ను ఘనంగా ముగించేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంచితే, భారత్ ముందు మరో సువర్ణావకాశం కూడా ఉంది.  చివరి వన్డేలో గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తే మాత్రం ఈ దశాబ్దపు కాలంలో రెండు జట్లను రెండుసార్లు 5-0తో వైట్ వాష్ చేసిన అరుదైన ఘనతను భారత్ సొంతం చేసుకుంటుంది. 2014లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో భారత్ 5-0 తో చేజిక్కించుకుంది. స్వదేశంలో జరిగిన ఆ వన్డే సిరీస్ లో భారత్ క్వీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు మరొకసారి శ్రీలంకను వారి దేశంలో క్లీన్ స్వీప్ చేసే అవకాశం దక్కింది. గత పదేళ్ల కాలంలో ఇంగ్లండ్ ను భారత్ జట్టు 5-0తో ఓడించింది.  2008-09 సీజన్ లో తొలిసారి ఇంగ్లండ్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. 2012-13 సీజన్ లో మరొకసారి వైట్ వాష్ చేసింది. ఆ తరువాత ఇంతకాలానికి మరొకజట్టును రెండోసారి 5-0 తో క్లీన్ చేసే అవకాశం శ్రీలంక రూపంలో టీమిండియా ముంగిట ఉంది.

 

Advertisement
Advertisement