Sakshi News home page

‘చెన్నై ఓపెన్‌ తరలిపోవడం నిరాశ కలిగించింది’

Published Sat, Jul 22 2017 10:33 AM

‘చెన్నై ఓపెన్‌ తరలిపోవడం నిరాశ కలిగించింది’ - Sakshi

చెన్నై: భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ ఈవెంట్‌ చెన్నై ఓపెన్‌ పుణేకు తరలిపోవడంపై భారత టెన్నిస్‌ స్టార్‌ బ్రదర్స్‌ విజయ్‌ అమృత్‌రాజ్, ఆనంద్‌ అమృత్‌రాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 21 ఏళ్ల క్రితం ఈ ఈవెంట్‌  చెన్నైలో జరిగేందుకు చెన్నైకు చెందిన అమృత్‌రాజ్‌ బ్రదర్స్‌ విశేష కృషి చేశారు. వచ్చే ఏడాది నుంచి ఈ టోర్నీ మహారాష్ట్ర ఓపెన్‌గా పుణేలో నిర్వహించనున్నారు.

 

1997లో తొలిసారిగా చెన్నైలో గోల్డ్‌ ఫ్లేక్‌ ఓపెన్‌ ఏటీపీ టోర్నీ పేరుతో జరిపారు. అప్పటినుంచి ఈ టోర్నీ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తూ వస్తోంది. ‘సుదీర్ఘకాలం నుంచి ఈ ఈవెంట్‌ చెన్నైలో జరుగుతోంది. ఇప్పుడు వేదిక మారుతుండటం నిరాశ కలిగిస్తోంది. అయితే భారత్‌లోనే జరుగుతుండటం సంతోషకరం’ అని విజయ్‌ అమృత్‌రాజ్‌ అన్నారు. మరోవైపు ఏటీపీ ఈవెంట్‌ చెన్నై నుంచి వెళ్లడం సిగ్గుచేటని ఆనంద్‌ స్పందించారు. అయితే పుణేలోనూ మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని కితాబిచ్చారు.  


 

Advertisement

What’s your opinion

Advertisement