ప్రతీ ప్లేయర్ నుంచి ఒక్కోటి అడిగిన మోదీ | Sakshi
Sakshi News home page

ప్రతీ ప్లేయర్ నుంచి ఒక్కోటి అడిగిన మోదీ

Published Fri, Feb 13 2015 12:48 PM

ప్రతీ ప్లేయర్ నుంచి ఒక్కోటి అడిగిన మోదీ

న్యూఢిల్లీ: వరల్డ్ కప్ క్రికెట్ సమరం మరికొద్ది గంటల్లో ఆరంభం కానుంది.  ఈ నేపథ్యంలో ప్రపంచంలోని క్రికెట్ అభిమానులతో పాటు, దేశ నాయకులు కూడా ప్రపంచకప్ పోరును ఆస్వాదించడానికి సిద్ధమవుతున్నారు. భారత ప్రధాని  నరేంద్ర మోదీ శుక్రవారం టీమిండియా ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.  ఇందులో భాగంగానే ఆయన ప్రతీ ఆటగాడి నుంచి ఒక్కోటి ఆశిస్తూ ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు.


టీమిండియా ఆటగాళ్ల నుంచి మోదీ ఏమీ ఆశిస్తున్నారు అనేది ఒక్కసారి చూద్దాం..

1. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ టోర్నీలో బంతిని బలంగా బాది టీమిండియా గర్వించే విధంగా చేయాలి. నీవు ఆ పని చేస్తావని నాకు నమ్మకం ఉంది.

2.  వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి వెరీ బెస్ట్. యావత్ భారత జాతి నీపై చాలా ఆశలు పెట్టుకుంది. అది చేసి చూపించాలి.

3. శిఖర్ ధావన్.. నీవు ఆడిన ప్రతీ సారి టీమిండియాకు మంచి ఆరంభం లభిస్తుంది. ఈ టోర్నీలో మరోసారి ఆకట్టుకోవాలి. ప్రపంచకప్ లో నీవు కీలక పాత్ర పోషించాలి.

4. రోహిత్ శర్మ..  వన్డేల్లో రెండు సార్లు డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా మరపురాని గుర్తింపు తెచ్చావు. భారత్ లోని క్రికెట్ అభిమానులతో పాటు నేను కూడా మరోసారి ఆ ఇన్నింగ్స్ రావాలని ఆశిస్తున్నాను.

5 . ఓ మై యంగ్ ఫ్రెండ్ అజ్యింకా రహానే.. ఈ వరల్డ్ కప్ నీకు చక్కటి అవకాశం.  దీన్ని చక్కగా వినియోగించుకుని దేశ ప్రతిష్టను  పెంచాలి.

6. అంబటి రాయుడు.. ఈ టోర్నమెంట్ పరుగుల వరద సృష్టించి కీలక పాత్ర పోషించు.

7. సర్ రవీంద్ర జడేజా..  నీకు ఫ్యాన్ కానిది ఎవరు?, నీ ఆల్ రౌండ్ ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.

8. అక్షర్ పటేల్.. నీ స్పిన్ అండ్ బౌన్స్ తో ప్రత్యర్థులను బోల్తా కొట్టించు. ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడి టీమిండియా గెలుపులో భాగస్వామ్యం కావాలి.

9. భువనేశ్వర్ కుమార్.. ప్రతీ మ్యాచ్ లోనూ బంతిని స్వింగ్ చేసి టీమిండియాకు చక్కటి బ్రేక్ ఇవ్వాలి.


10. మోహిత్ కుమార్.. నీవు లైన్ లెంగ్త్ తో బౌలింగ్ చేసి టీం విజయానికి దోహద పడాలి.

11.  మహ్మద్ షమీ.. వెరీ వెరీ బెస్ట్ . వరల్డ్ కప్ లో బాగా రాణించి.. ఎక్కువ వికెట్లు తీయాలి.

 

12. సురేష్ రైనా..  ఫీల్డ్ లో చురుకుగా ఉంటావు. నీవు బంతిని బలంగా కొట్టి స్టేడియం బయటకి పంపించు.

 

 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement