ఏఎస్‌ఐఎస్‌సీ క్రీడలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

ఏఎస్‌ఐఎస్‌సీ క్రీడలు ప్రారంభం

Published Mon, Nov 7 2016 10:36 AM

ASISC games started

హైదరాబాద్:అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ (ఏఎస్‌ఐఎస్‌సీ) జాతీయ క్రీడలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఆఫ్ ఎగ్జామినేషన్‌‌స న్యూఢిల్లీ చైర్మన్ డాక్టర్ జి.ఇమ్మాన్యూల్ జ్యోతిని వెలిగించి ఈ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. పాఠశాల స్థాయిలోనే క్రీడా ప్రతిభను చాటుకోవాలని  విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు. గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని ఆకాంక్షించారు.
 
 విద్యార్థులకు ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించాలని అన్నారు. అందుకు ఏఎస్‌ఐఎస్‌సీ నేషనల్ గేమ్స్‌ను ఉదాహరణగా అభివర్ణించారు.  ఏఎస్‌ఐఎస్‌సీ తెలంగాణ, ఏపీ రీజనల్ సెక్రటరీ మారుతి రాంప్రసాద్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 9 తొమ్మిది రీజియన్ల నుంచి 1600 స్కూళ్లు, 3500 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ నెల 11వ తేదీ వరకు నగరంలోని వివిధ చోట్ల 8 ఈవెంట్లలో పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఆఫ్ ఎగ్జామినేషన్‌‌స న్యూఢిల్లీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సెక్రటరీ జెర్?ర అర్తూన్, వరల్డ్ ఆర్మ్ రెజ్లింగ్ చాంపియన్ జాబి మాథ్యూ, రియో పారా ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన వరుణ్ సింగ్ భాటి తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement