Sakshi News home page

'అందుకు కోహ్లినే కారణం'

Published Mon, Sep 18 2017 11:45 AM

'అందుకు కోహ్లినే కారణం'

చెన్నై: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో తమ కెప్టెన్ విరాట్ కోహ్లి వల్లే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినట్లు టీమిండియా స్సిన్నర్ యజ్వేంద్ర చాహల్ స్పష్టం చేశారు. ప్రత్యర్థి జట్టుపై ఎదురుదాడి చేసే స్వేచ్ఛ కోహ్లి ఇచ్చాడు కాబట్టే చెలరేగి వికెట్లు సాధించినట్లు చాహల్ అన్నారు. 'ప్రధానంగా మణికట్టు స్పిన్నర్లు ఎక్కువగా అటాక్ చేస్తారు. కానీ మా కెప్టెన్ మాత్రం స్పిన్నర్లను ఎదురుదాడికి దిగమనే చెబుతాడు. ఎందుకంటే మా కెప్టెన్ దూకుడు ఉంటాడు కాబట్టే.. మమ్మల్ని కూడా అటాక్ చేయమంటూ స్వేచ్ఛగా బౌలింగ్ చేసే అవకాశం కల్పిస్తాడు. కొన్ని సందర్బాల్లో మాత్రం మా ప్రణాళికల్ని సమయాన్ని బట్టి మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కూడా కోహ్లి నుంచి ఇబ్బంది ఉండదు. ఆ స్వేచ్ఛ నిన్నటి మ్యాచ్ లో మరొకసారి చూసాను కాబట్టే మూడు వికెట్లు సాధించా. ఇక్కడ కుల్దీప్ యాదవ్ నుంచి సహకారం లభించింది. మేమిద్దరం వికెట్లే లక్ష్యంగా బౌలింగ్ చేశాం. ఎప్పుడు కూడా సేఫ్ జోన్లో ఉన్నామని ఆడకూడదు. అవతలి జట్టును ఇబ్బందుల్లోకి నెట్టే యత్నం చేస్తేనే పైచేయి సాధిస్తాం. మనం ఏ సమయంలోనైనా సేఫ్ గా ఉన్నామని భావిస్తే, అది మ్యాచ్ లను గెలిపించలేదు'అని చాహల్ పేర్కొన్నాడు.

 

నిన్నటి మ్యాచ్ లో ఐదు ఓవర్లు బౌలింగ్  వేసిన చాహల్ 30 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించి గెలుపులో తన వంతు  సహకారాన్ని సమర్ధవంతంగా నిర్వర్తించాడు.
 

Advertisement
Advertisement