టి20 ప్రపంచ రికార్డూ బద్దలు | Sakshi
Sakshi News home page

టి20 ప్రపంచ రికార్డూ బద్దలు

Published Wed, Sep 7 2016 1:55 AM

టి20 ప్రపంచ రికార్డూ బద్దలు

20 ఓవర్లలో ఆస్ట్రేలియా 263
శ్రీలంకపై మ్యాక్స్‌వెల్ మెరుపు సెంచరీ


20 ఓవర్లలో 3 వికెట్లకు 263 పరుగులు... అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో      ఆస్ట్రేలియా సృష్టించిన పరుగుల సునామీ ఇది. వీర విధ్వంసకారుడు మ్యాక్స్‌వెల్ మెరుపు సెంచరీతో ముందుండి నడిపించగా... కంగారూలు కొత్త ప్రపంచ రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. వన్డేల్లో అత్యధిక స్కోరు రికార్డు బద్దలైన వారం రోజులకే అంతర్జాతీయ టి20ల్లోనూ కొత్త రికార్డు నమోదు కాగా, రెండు సార్లూ శ్రీలంక పేరిట ఉన్న రికార్డు బద్దలు కావడం విశేషం.


పల్లెకెలె: పేలవమైన ఫామ్‌తో వన్డేల్లో స్థానం కోల్పోరుు తీవ్ర విమర్శలపాలైన హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తన విలువేమిటో టి20ల్లో చూపించాడు. అద్భుత బ్యాటింగ్‌తో జట్టులో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన మ్యాక్స్‌వెల్ (65 బంతుల్లో 145 నాటౌట్; 14 ఫోర్లు, 9 సిక్సర్లు) దూకుడుతో శ్రీలంకతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు సాధించింది. అంతర్జాతీయ టి20ల్లో ఒక జట్టుకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. మ్యాక్స్‌వెల్‌కు హెడ్ (18 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఖాజా (22 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), వార్నర్ (16 బంతుల్లో 28; 5 ఫోర్లు) అండగా నిలిచారు. అనంతరం 20 ఓవర్లలో 9 వికెట్లకు 178 పరుగులు చేసిన శ్రీలంక 85 పరుగుల తేడాతో చిత్తరుుంది.


బౌండరీల వర్షం...
ఆసీస్ ఇన్నింగ్‌‌స తొలి ఓవర్లో 3 పరుగులే వచ్చారుు. మధ్యలో మరో రెండు ఓవర్లు మినహా మిగతా 17 ఓవర్లలో విధ్వంసం కొనసాగింది. ఆరంభంలో రజిత ఓవర్లో నాలుగు ఫోర్లు బాది వార్నర్ ధాటిని ప్రదర్శించగా ఆ తర్వాత ఖాజా, హెడ్ దానిని కొనసాగించారు. అరుుతే ఆటను శాసించింది మాత్రం మ్యాక్స్‌వెలే. తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతను ఏ లంక బౌలర్‌ను కూడా వదిలి పెట్టలేదు. 49 బంతుల్లోనే అతను సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సేనానాయకే వేసిన ఒక ఓవర్లో 3 సిక్సర్లు, ఫోర్లతో 23 పరుగులు రాబట్టిన మ్యాక్సీ చివరకు అజేయంగా నిలిచాడు. భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక పోటీనిచ్చే ప్రయత్నం చేసినా విజయానికి చాలా దూరంలో నిలిచిపోరుుంది. చండీమల్ (43 బం తుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్), కపుగెదెర (25 బం తుల్లో 43; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు.


అంతర్జాతీయ టి20ల్లో ఇదే అత్యధిక స్కోరు. 2007లో కెన్యాపై శ్రీలంక (260) సాధించిన రికార్డు తెరమరుగైంది.
అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాళ్లలో ఆరోన్ ఫించ్ (156) తర్వాత మ్యాక్స్‌వెల్ రెండో స్థానంలో నిలిచాడు.
ఓవరాల్‌గా అంతర్జాతీయ, దేశవాళీ టి20ల్లో కలిపి అత్యధిక స్కోరు రికార్డు కూడా ఇప్పుడు సమమైంది. 2013 ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా 263 పరుగులు చేసింది.

 

 

Advertisement
Advertisement