Sakshi News home page

సచిన్‌కు ఆసీస్ ‘చెక్’

Published Thu, Jan 29 2015 12:06 AM

సచిన్‌కు ఆసీస్ ‘చెక్’

ఫ్లాష్ బ్యాక్

2003 ప్రపంచకప్ మొత్తం సచిన్ టెండూల్కర్‌దే హవా. ఈ టోర్నీలో భారత దిగ్గజం 673 పరుగులు చేసి కొత్త రికార్డు సృష్టించారు. ఒక్క ఫైనల్ మినహా టోర్నీలోని ప్రతి మ్యాచ్‌లోనూ తన ముద్ర చూపించాడు. పాకిస్తాన్‌పై భారత్ విజయం, ఫైనల్లో భారత్‌పై పాంటింగ్ ఆడిన ఇన్నింగ్స్, డక్‌వర్త్ పద్ధతిని దక్షిణాఫ్రికా తప్పుగా అర్థం చేసుకోవడం... ఇలా ఈ టోర్నీలో విశేషాలు కావలసినన్ని ఉన్నాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా ఉమ్మడిగా ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో మొత్తం 54 మ్యాచ్‌లు జరిగాయి.

ఈ టోర్నీలో భారత్ కేవలం రెండే మ్యాచ్‌ల్లో ఓడింది. ఆ రెండూ ఆసీస్ చేతిలోనే కావడం విశేషం. మరోవైపు టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆస్ట్రేలియా అజేయంగా నిలిచి వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ను తన ఖాతాలో వేసుకుంది. మొత్తం 14 జట్లు రెండు గ్రూప్‌లుగా లీగ్ దశ ఆడి, ఆ తర్వాత సూపర్ సిక్స్‌లో తలపడ్డాయి. దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు చేరలేకపోయాయి. ఈ టోర్నీలో ఏ మాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన కెన్యా అనూహ్యంగా సెమీస్‌కు చేరి సంచలనం సృష్టించింది. మొత్తం మీద సచిన్ జోరుకు చెక్ పెట్టి ఆసీస్ టైటిల్ గెలిచింది.
 
ఆతిథ్యం: దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా; వేదికలు: 15
 పాల్గొన్న జట్లు (14): భారత్, పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా, బంగ్లాదేశ్. కెనడా, నెదర్ల్లాండ్స్, నమీబియా.

Advertisement

What’s your opinion

Advertisement