ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మృతి | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మృతి

Published Fri, Apr 10 2015 8:08 AM

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మృతి

హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత రిచీ బెనాడ్ (84) శుక్రవారం ఉదయం మరణించారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు చానల్ నైన్ ప్రకటించింది. గురువారం రాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఆసుపత్రిలో చేర్పించారు. వయసు మీరిపోవటంతో ఆయన ఆరోగ్యం వైద్యానికి సహకరించలేదు. ఆయన నిద్రలో ఉండగానే మృత్యు ఒడిలోకి చేరుకున్నారు.

 

63 టెస్ట్ మ్యాచ్ లో ఆడిన  రిచీ బెనాడ్..రెండు వేలు పరుగులు చేసిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. దీంతో పాటు 27.0కు పైగా సగటుతో 248 టెస్ట్ వికెట్లను తీశారు. బెన్నాడ్ 28 టెస్ట్ లకు నేతృత్వం వహించి అన్నింటా విజయం సాధించిన కెప్టెన్ గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. తన టెస్ట్ కెరీర్ లో 122 పరగులు అత్యధిక స్కోరు. కాగా, 16 సార్లు ఐదు వికెట్లను తీసిన క్రికెటర్ గా బెనాడ్ గుర్తింపు పొందాడు. కెర్రీ పాకర్స్ వరల్డ్ సిరీస్ ను ప్రవేశపెట్టడంలో కూడా బెన్నాడ్ ప్రముఖ పాత్ర వహించారు.

 

1930లో జన్మించిన బెనాడ్..1952 టెస్ట్ క్రికెట్ ను ఆరంభించారు. దశాబ్దానికి పైగా ఆస్ట్రేలియా క్రికెట్ కు సేవలందించారు.  వెస్టిండీస్ పై తొలి టెస్ట్ ఆడిన బెనాడ్..1964 లో సౌతాఫ్రికాపై చివరి టెస్ట్ తో తన క్రికెట్ జీవితానికి స్వస్తి చెప్పారు. 1970 లో క్రికెట్ వ్యాఖ్యాతగా తన రెండో ఇన్నింగ్స్ బెనాడ్ ఆరంభించారు.నాలుగు దశాబ్దాలుగా క్రికెట్ వ్యాఖ్యాతగా సేవలందించిన బెనాడ్ ..2013లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటమే కాకుండా ఆ తదుపరి సంవత్సరం క్యాన్సర్ బారిన పడ్డారు.

 

బెన్నాడ్ మృతిపై పలువురు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇది నిజంగా ఆస్ట్రేలియా దుర్దినంగా ప్రధాని టోనీ ఆబాట్ పేర్కొన్నారు.  బెన్నాడ్ నిజంగా గొప్ప క్రికెటర్ గానే కాకుండా కెప్టెన్ గా కూడా తనదైన ముద్ర వేశాడని ఆసీస్ ప్రస్తుత కెప్టెన్ మైకేల్ క్లార్క్ సంతాపం తెలిపాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement