ప్రతీకారం తీర్చుకున్న ఆసీస్! | Sakshi
Sakshi News home page

లయన్ విజృంభణ.. ఆసీస్ ఘనవిజయం

Published Thu, Sep 7 2017 6:13 PM

ప్రతీకారం తీర్చుకున్న ఆసీస్!

చిట్టగాంగ్: తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ చేతిలో ఎదురైన పరాభవానికి ఆస్ట్రేలియా జట్టు ప్రతీకారం తీర్చుకుంది. సిరీస్‌లో చివరిదైన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ తమకు నిర్ధేశించిన 86 పరుగుల లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే ఛేదించి సగర్వంగా తలెత్తుకుంది. ఈ విజయంతో బంగ్లాతో టెస్ట్ సిరీస్ ను 1-1తో ఆసీస్ సమం చేసింది. తొలి టెస్టులో 20 పరుగుల తేడాతో మాజీ టెస్టు నంబర్‌వన్‌ ఆస్ట్రేలియాపై బంగ్లా జట్టు సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో రెండో టెస్టులో ఎలాంటి పొరపాట్లు చేయని ఆసీస్ విజయం సాధించింది. 
 
రెండు ఇన్నింగ్స్ ల్లోనూ ఐదు వికెట్ల ప్రదర్శన (7/94, 6/60)తో చెలరేగిన ఆసీస్ స్పిన్నర్ లయన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. సీరిస్ లో ఆకట్టుకున్న డేవిడ్ వార్నర్ తో కలిసి సంయుక్తంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గానూ లయన్ నిలవడం గమనార్హం. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 9/377తో నాలుగోరోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ అదే స్కోరువద్ద నాథన్ లయన్ ఔట్ కావడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా 305 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆసీస్ కు 72 పరుగుల ఆధిక్యం లభించినట్లయింది. 
 
అయితే రెండో ఇన్నింగ్స్ కు దిగిన బంగ్లాదేశ్.. ఆసీస్ స్టార్ స్పిన్నర్ లయన్ 6/60 తో రెండో ఇన్నింగ్స్ లోనూ చెలరేగడంతో ఆ జట్టు 157 పరగులకే చాపచుట్టేసింది. ఆసీస్ ముందు 86 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ రెన్షా (22), వార్నర్ (8), స్టీవ్ స్మిత్ (16) వికెట్లు కోల్పోయినా.. హ్యాండ్స్ కోంబ్ (16 నాటౌట్), మ్యాక్స్ వెల్ (25 నాటౌట్) మిగతా పనిని అలవోకగా పూర్తిచేశారు. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. 
Bangladesh, second Test, Australia, Nathan Lyon, బంగ్లాదేశ్‌, రెండో టెస్టు, ఆస్ట్రేలియా, నాథన్ లయన్
 
చిట్టగాంగ్: ఆసీస్ జరుగుతున్న చివరిదైన రెండో టెస్టులో బంగ్లాదేశ్ 86 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.  నాల్గో రోజు ఆటలో భాగంగా గురువారం తన రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ 157 పరుగులకే కుప్పకూలింది.  ఆసీస్ స్పిన్నర్ నాధన్ లయన్ మరోసారి విజృంభించి బంగ్లా ఇన్నింగ్స్ ను కకావికలం చేశారు. లయన్ ఆరు వికెట్లతో చెలరేగడంతో బంగ్లాదేశ్ 71.2 ఓవర్లలోనే ఇన్నింగ్స్ ను ముగించింది.  అంతకుముందు 377/9 ఓవర్ నైట్ స్కోరుతో  తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్.. అదే స్కోరు వద్ద చివరి వికెట్ ను సైతం నష్టపోయింది.
 
ఆపై రెండో ఇన్నింగ్స్ కు దిగిన బంగ్లాదేశ్ 43 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది .ఆ తరుణంలో షబ్బిర్ రెహ్మన్, ముష్పికర్ రహీమ్ లు స్కోరు  బోర్డును చక్కదిద్దే యత్నం చేశారు. ఈ జోడి 54 పరుగులు జత చేయడంతో బంగ్లా కాస్త కుదురుకుంది. కాగా, అటు తరువాత బంగ్లా కథ మళ్లీ మొదటికి వచ్చింది. రహీమ్(31), షబ్బిర్(24)లు తరువాత మోమినుల్ హక్(29) మోస్తరుగా ఫర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్ లో లయన్ మొత్తం 13 వికెట్లతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో లయన్ ఏడు వికెట్లతో చెలరేగిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో బంగ్లాదేశ్ విజయం సాధించింది. రెండో టెస్టులో ఆసీస్ విజయం సాధిస్తే సిరీస్ సమం అవుతుంది
 
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 305 ఆలౌట్,  రెండో ఇన్నింగ్స్ 157 ఆలౌట్
 
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 377 ఆలౌట్,   రెండో ఇన్నింగ్స్  87/3 (15.3 ఓవర్లలో)
 

Advertisement
Advertisement