విరాట్ సేన ఫస్ట్ బ్యాటింగ్ | Sakshi
Sakshi News home page

విరాట్ సేన ఫస్ట్ బ్యాటింగ్

Published Tue, Oct 10 2017 6:41 PM

Australia won the toss and elected to field first

గువాహటి:భారత్ తో ఇక్కడ బర్సపరా స్టేడియంలో జరుగుతున్న రెండో టీ 20లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి  ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆసీస్  కెప్టెన్ డేవిడ్ వార్నర్ తొలుత విరాట్ సేనను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ లో భారత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. ఆశిష్ నెహ్రాకు ఈ మ్యాచ్ లో అవకాశం కల్పిస్తారని భావించినా.. భారత్ ఎటువంటి రిస్క్ తీసుకోకుండా గత జట్టునే కొనసాగించింది.


ఈ స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. 2013-14 సీజన్ లో నాలుగు రంజీ మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చిన బర్సపరా స్టేడియం.. మొదటిసారి అంతర్జాతీయ మ్యాచ్ కు వేదిక కానుంది. అంతకుముందు 2010లో గువహటిలో న్యూజిలాండ్-భారత జట్ల మధ్య  చివరిసారి వన్డే జరిగింది. ఆ మ్యాచ్ లో భారత్ 40 పరుగుల తేడాతో గెలిచింది. అయితే అది నగరంలోని నెహ్రూ స్టేడియం కాగా, ఆపై అస్సోం క్రికెట్  అసోసియేషన్(ఏసీఏ) తమ అంతర్జాతీయ మ్యాచ్ లను నెహ్రూ స్టేడియం నుంచి బర్సపరాకు మారింది. దాంతో ఏడేళ్ల తరువాత నగరం అంతర్జాతీయ మ్యాచ్ కు సిద్ధం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే టీమిండియా వన్డే సిరీస్ ను 4-1 తేడాతో గెలవడంతో పాటు, తొలి టీ 20లో సైతం బోణి కొట్టి పొట్టి సిరీస్ లో పైచేయి సాధించింది. దాంతో రేపటి మ్యాచ్ లో భారత్ గెలిస్తే మాత్రం సిరీస్ ను ఇంకా మ్యాచ్ ఉండగానే ముగిస్తుంది. మొదటి టీ 20లో భారత్ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి మంచి జోరు మీద ఉంది. వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ ప్రకారం నిర్దేశించిన ఆరు ఓవర్లలో 48 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు బంతులు మిగిలి ఉండగా ఛేదించి తమకు తిరుగులేదని నిరూపించుకుంది. కాగా, ఆసీస్ తన తలరాతను మార్చుకోవాలనే పట్టుదలగా ఉంది.

తుది జట్లు

భారత్: విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ,మనీష్ పాండే, ఎంఎస్ ధోని, కేదర్ జాదవ్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, బూమ్రా, చాహల్

ఆసీస్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), ఆరోన్ ఫించ్, మ్యాక్స్ వెల్, ట్రావిస్ హెడ్, హెన్రిక్యూస్,  స్టోనిస్, టిమ్ పైనీ, కౌల్టర్ నైల్, ఆండ్రూ టై, ఆడమ్ జంపా, బెహ్రెన్ డార్ఫ్

Advertisement

తప్పక చదవండి

Advertisement