చారిత్రక టెస్టులోనైనా.. | Sakshi
Sakshi News home page

చారిత్రక టెస్టులోనైనా..

Published Tue, Mar 14 2017 2:12 PM

చారిత్రక టెస్టులోనైనా.. - Sakshi

కొలంబో: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సంచలనాలకు మారుపేరు. అయితే  ఈ జట్టు గత కొంతకాలంగా విజయాలు సాధించడంలో వెనుకబడింది. 2016 అక్టోబర్ లో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ లో భాగంగా ఢాకా మ్యాచ్ లో విజయం సాధించిన బంగ్లాదేశ్.. ఆ తరువాత పూర్తిగా చతికిలబడింది.

 

న్యూజిలాండ్ తో వారి దేశంలో జరిగిన రెండు టెస్టుల్లో బంగ్లాదేశ్ ఓటమి పాలు కాగా, ఆపై భారత్ లో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ లో కూడా పరాజయం చవిచూసింది. ప్రస్తుతం శ్రీలంకతో సిరీస్ లో భాగంగా తొలి  టెస్టులో ఓటమి పాలైన బంగ్లాదేశ్.. రెండో టెస్టులో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదల ఉంది. గురవారం శ్రీలంకతో జరిగే టెస్టు మ్యాచ్ బంగ్లాదేశ్ కు చారిత్రక టెస్టు మ్యాచ్. ఆ టెస్టు మ్యాచ్ బంగ్లాదేశ్ కు 100 వ టెస్టు మ్యాచ్ కావడంతో ఎలాగైనా గెలుపుబావుటా ఎగురవేయడానిక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది.


శ్రీలంకతో గాలేలో జరిగిన తొలి టెస్టులో 259 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.అది బంగ్లాకు 76 టెస్టు మ్యాచ్ పరాజయం కాగా, వరుసగా నాల్గోది. మరి చారిత్రక టెస్టులో బంగ్లాదేశ్ విజయం సాధిస్తుందా? లేకు పెద్దగా అనుభవం లేని లంకేయులు ముందు తలవంచుతుందా?చూడాలి.




 

Advertisement
Advertisement