బీసీసీఐ నన్ను భరించలేదు! | Sakshi
Sakshi News home page

బీసీసీఐ నన్ను భరించలేదు!

Published Tue, Jun 6 2017 12:40 AM

బీసీసీఐ నన్ను భరించలేదు!

కోచ్‌ పదవిపై షేన్‌ వార్న్‌ వ్యాఖ్య   

మెల్‌బోర్న్‌:  భారత జట్టు కొత్త కోచ్‌ ఎంపిక గురించి తీవ్ర చర్చ నడుస్తోంది. ప్రస్తుత కోచ్‌ కుంబ్లేతో పాటు సెహ్వాగ్, మూడీ తదితరులు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ను ఇదే విషయంపై ప్రశ్నించగా, ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘ఊహించనంత భారీ మొత్తాన్ని కోచ్‌గా నాకు అందించాల్సి ఉంటుంది.

బీసీసీఐ నన్ను భరించగలదని నేను అనుకోవడం లేదు. విరాట్‌ కోహ్లి, నేను కలిసి అద్భుతమైన ఫలితాలు సాధించగలం. కానీ ముందే చెప్పినట్లు నన్ను తీసుకోవాలంటే చాలా చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే’ అని వార్న్‌ వ్యాఖ్యానించారు. 2007లో రిటైర్‌ అయిన వార్న్, ప్రస్తుతం వివిధ చానల్స్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. 

Advertisement
Advertisement