త్రయానికి కోచ్ ఎంపిక బాధ్యత | Sakshi
Sakshi News home page

త్రయానికి కోచ్ ఎంపిక బాధ్యత

Published Wed, Jun 15 2016 11:53 PM

త్రయానికి కోచ్ ఎంపిక బాధ్యత

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్‌ను ఎంపిక చేసే ప్రక్రియ వేగవంతమైంది. కోచ్ పదవి కోసం వచ్చిన దరఖాస్తుల నుంచి అర్హుడైన వ్యక్తిని ఎంపిక చేసే బాధ్యతను దిగ్గజ త్రయానికి అప్పగించినట్లు బీసీసీఐ తెలిపింది. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యులైన సచిన్, గంగూలీ, లక్ష్మణ్ కలిసి కోచ్‌ను ఎంపిక చేయనున్నారు. ఇప్పటివరకు 57 మంది అభ్యర్థులు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో నుంచి షార్ట్ లిస్ట్ చేసిన 21 మంది సభ్యుల జాబితాను సీఏసీకి పంపించినట్లు బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే తెలిపారు.

సంజయ్ జగ్దాలే చీఫ్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న ఈ కమిటీ... అభ్యర్థుల పూర్వాపరాలు పరిశీలించి, ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. జూన్ 21 వరకు ఈ ప్రక్రియను ముగించి తుది నివేదికను జూన్ 22న బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌కు అందజే స్తుంది. సీఏసీలో కీలక సభ్యుడైన సచిన్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్నారు. కోచ్ ఎంపిక  ప్రక్రియలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులో ఉంటాడని బీసీసీఐ స్పష్టం చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement