బీసీసీఐ ఆదాయం 3727 కోట్లు!! | Sakshi
Sakshi News home page

బీసీసీఐ ఆదాయం 3727 కోట్లు!!

Published Fri, Feb 28 2014 1:17 PM

బీసీసీఐ ఆదాయం 3727 కోట్లు!!

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మొత్తాన్ని ప్రక్షాళన చేయడంతో.. వివిధ బోర్డుల ఆదాయాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రాబోయే ఎనిమిదేళ్లలో బీసీసీఐకి 3,727 కోట్ల రూపాయల ఆదాయం రాబోతోంది. ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడించారు. 2015 నుంచి 2023 వరకు రాబోయే ఎనిమిదేళ్లలో తన అంచనాల ప్రకారం బీసీసీఐ ఇంత మొత్తం ఆదాయం సంపాదిస్తుందని ఆయన ఓ వార్తా చానల్కు తెలిపారు. బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన భువనేశ్వర్ వచ్చారు. సరిగ్గా 2015-2023 మధ్య కాలంలో ఐసీసీలోని మూడు ప్రధాన కమిటీలలో భారత్కు శాశ్వత సభ్యత్వం కూడా ఉంటుంది.

ఐసీసీకి ఆదాయం సంపాదించి పెట్టే బోర్డులలో చాలా సంవత్సరాలుగా బీసీసీఐ అగ్రస్థానంలో ఉంటోందని పటేల్ వివరించారు. ఐసీసీ ఆదాయంలో బీసీసీఐ 68 శాతాన్ని అందిస్తూ, తిరిగి కేవలం 4 శాతం మాత్రమే ఇన్నాళ్లూ తీసుకుంటోందన్నారు. ఇక ఇప్పుడు ఈ నాలుగు శాతానికి బదులు 21 శాతం బీసీసీఐకి వస్తుందని, 2015-23 మధ్య కాలంలో బీసీసీఐ స్థూల ఆదాయం దాదాపు 18636 కోట్ల రూపాయలు ఉండొచ్చని సంజయ్ పటేల్ చెప్పారు.

Advertisement
Advertisement