అంతా నా గురించే మాట్లాడుకున్నారు: స్టోక్స్ | Sakshi
Sakshi News home page

అంతా నా గురించే మాట్లాడుకున్నారు: స్టోక్స్

Published Fri, Jun 30 2017 11:33 AM

అంతా నా గురించే మాట్లాడుకున్నారు: స్టోక్స్

లండన్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10వ సీజన్ వేలంలో అత్యంత విలువైన ఆటగాడిగా ఇంగ్లండ్ కు చెందిన బెన్ స్టోక్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అతనికి రూ. 14. 5 కోట్లు రికార్డు ధర చెల్లించి రైజింగ్ పుణె సూపర్ జెయింట్ దక్కించుకుంది.  బెన్ స్టోక్స్ ఆల్ రౌండర్ కావడమే అతన్ని పుణె పోటీ పడి కొనుగోలు చేసింది. అందుకు బెన్ స్టోక్స్ తగిన న్యాయం చేశాడనే చెప్పాలి. రైజింగ్ పుణె ఫైనల్ కు చేరే క్రమంలో స్టోక్స్ పాత్ర వెలకట్టలేనిది.  మూడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు గెలుచుకుని జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

అయితే ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐపీఎల్ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఎలా ఖర్చు చేశాడో స్టోక్స్ వివరించాడు.  ఈ లీగ్ ద్వారా వచ్చిన మొత్తంలో కొంత సొమ్మును కారు కొనడానికి ఉపయోగించినట్లు పేర్కొన్నాడు. తనకు కార్లంటే విపరీతమైన అభిమానమని తెలిపిన స్టోక్స్.. ఓ కారును కొనుగోలు చేశానన్నాడు. 'ఐపీఎల్లో ఎక్కువ ధర పలకడంతో అందరూ నా గురించే మాట్లాడుకున్నారు. అంత ధర పలకడంపై నేను కూడా ఆశ్చర్యపోయా. ఆ ధరకు న్యాయం చేయగలనా అని జడ్జ్ చేసుకున్నా. కాకపోతే నా వరకూ న్యాయం చేశాననే అనుకుంటున్నా'అని స్టోక్స్ తెలిపాడు. కేవలం కొది మొత్తాన్ని మాత్రమే వెచ్చించి కారు కొనుగోలు చేశానని, ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని దేనికీ ఉపయోగించలేదన్నాడు.

Advertisement
Advertisement