నువ్వంటే... నువ్వే | Sakshi
Sakshi News home page

నువ్వంటే... నువ్వే

Published Sun, May 3 2015 2:53 AM

నువ్వంటే... నువ్వే - Sakshi

ఫుట్‌బాల్ మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్ల మధ్య గొడవలు జరగడం సహజమే. మాటా మాటా అనుకోవడంతో పాటు ఒక్కోసారి కలబడతారు కూడా. కానీ అదేం చిత్రమో ఇక్కడ సొంత జట్టు ఆటగాళ్లే పరస్పరం బాహాబాహీకి దిగారు. ఇదంతా ఎక్కడ జరిగిందంటే... బ్రెజిల్‌కు చెందిన ప్లాసిడో డి క్యాస్ట్రో, రియో బ్రాంకో క్లబ్‌ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. ఇందులో ప్లాసిడో జట్టు 2-5 గోల్స్ తేడాతో చిత్తుగా ఓడింది. ప్రత్యర్థి ఐదో గోల్ చేయగానే ప్లాసిడో ఆటగాళ్లు ఉయిలిన్, ఫాబియో జూనియర్ మధ్య గొడవ ప్రారంభమైంది. ఒకరిపై మరొకరు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూ తోసుకోవడంతో పాటు పంచ్‌లు ఇచ్చుకున్నారు. వేగంగా స్పందించిన సహచరులు వీరిని విడదీసేందుకు ప్రయత్నించారు. అయినా కూడా ఆగకుండా తమ దాడులను కొనసాగించారు. అయితే అతికష్టమ్మీద వీరిని విడదీసిన ఇతర ఆటగాళ్లు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అటు ప్లాసిడో అధ్యక్షుడు అనిజియో జరిగిన దానికి క్షమాపణలు చెప్పారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement