Sakshi News home page

ప్రపంచకప్‌లో మన బౌలర్లు రాణిస్తారు!

Published Thu, Mar 13 2014 1:05 AM

ప్రపంచకప్‌లో మన బౌలర్లు రాణిస్తారు!

యువరాజ్ సింగ్ ఆశాభావం
 కోల్‌కతా: ఇటీవల వన్డేల్లో భారత బౌలర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చకపోయినా... ప్రపంచకప్‌లో రాణిస్తారని సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. టి20 భిన్నమైన ఫార్మాట్ కాబట్టి వన్డే ప్రదర్శనతో పోల్చలేమని అన్నాడు. ‘వన్డేల్లో అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల కారణంగా మన బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోతున్నారు.
 
 అయితే టి20లు వేరు. కాబట్టి ప్రపంచకప్‌లో వారు ఆకట్టుకోగలరు’ అని యువీ చెప్పాడు. టి20 మ్యాచ్ ఆఖరి 5-10 ఓవర్లలో చెలరేగే ఆటగాళ్లు మన జట్టులో ఉన్నారని, తనతో పాటు ధోని, రైనా, రోహిత్, కోహ్లిలతో అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ టీమిండియా సొంతమన్నాడు.
 
 యువరాజ్‌కు డోప్ పరీక్ష
 కోల్‌కతా: జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) బుధవారం క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు డోప్ పరీక్ష నిర్వహించింది. విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అనంతరం యువీనుంచి ‘నాడా’ శాంపిల్ తీసుకుంది. ఈ పరీక్ష ఫలితాలను త్వరలో బీసీసీఐకి అందజేస్తారు. యువీతో పాటు రైల్వేస్ కెప్టెన్ మహేశ్ రావత్‌కు కూడా డోప్ పరీక్ష జరిపారు.
 

Advertisement
Advertisement