Sakshi News home page

బాక్సింగ్ చాంప్ జనక్‌రాజ్

Published Fri, Sep 13 2013 11:59 PM

boxing champion janakraj

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జూనియర్ ఇంటర్ కాలేజి బాక్సింగ్ చాంపియన్‌షిప్ 54 కేజీల విభాగంలో ఎం.జనక్‌రాజ్ (కేశవ స్మారక జూనియర్ కాలేజి) విజేతగా నిలిచాడు. ఇక్కడి ఎల్బీ స్టేడియంలోని బాక్సింగ్ హాల్‌లో శుక్రవారం జరిగిన ఫైనల్లో జనక్‌రాజ్... జి.వికాస్ (ఎల్‌బీ జూనియర్ కాలేజి)పై విజయం సాధించాడు. రాష్ట్ర వ్యాయామ విద్యా ఉపాధ్యాయుల సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.సోమేశ్వర్‌రావు, హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య మాజీ కార్యదర్శి డాక్టర్ ఎస్.రవీందర్‌రావు విజేతలకు పతకాలను అందజేశారు.
 
 ఫైనల్స్ ఫలితాలు
 48 కేజీలు:1. ఎస్.సతీష్ (ప్రగతి జూనియర్ కాలేజి), 2. డి.గౌతమ్ (చైతన్య జూనియర్ కాలేజి), 3. ఎన్.సాయి కిరణ్ (రాయల్ జూనియర్ కాలేజి), ప్రేమ్ (ప్రగతి జూనియర్ కాలేజి). 51 కేజీలు: 1. పి.మహేందర్ (న్యూ చైతన్య), 2. ఎం.నాగరాజ్ (ప్రగతి కాలేజి), 3. పి.లఖన్ (ఎల్.బి. జూనియర్ కాలేజి), టి.పవన్ (రాయల్ కాలేజి). 57 కేజీలు: 1.ఎం.మతీన్ (ప్రెసిడెన్సీ కాలేజి), 2.రూపేష్ కుమార్ (కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజి). 60 కేజీలు: 1. ఎస్.సాయి (ఎల్‌బీ జూనియర్ కాలేజి), 2.సిల్వెస్టర్ (డీఎస్‌డీ). 64 కేజీలు: 1. పి.ప్రభాకర్ (న్యూ ఎరా కాలేజి), 2. ఎం.క్రాంతి కుమార్ (ఠాగూర్స్ హోమ్ జూనియర్ కాలేజి), 3. రజినీకాంత్ (కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజి), జి.సాయి బాబు (న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజి, మలక్‌పేట్). 69 కేజీలు: ఎ.మనీష్ యాదవ్ (వెస్లీ జూనియర్ కాలేజి), 75 కేజీలు: సయ్యద్ బషీరుద్దీన్ (శ్రీచైతన్య జూనియర్ కాలేజి), 2. మీర్జా ఆసిఫ్ (రైల్వే జూనియర్ కాలేజి), 81 కేజీలు: 1.కె.సన్నీ (ప్రగతి కాలేజి), 91 కేజీలు: 1. మహ్మద్ మోసిన్ (ప్రెసిడెన్సీ కాలేజి), ప్లస్ 91 కేజీలు: 1. ఉమా మహేశ్ రాజ్ (కెన్ జూనియర్ కాలేజి).
 

Advertisement

What’s your opinion

Advertisement