బ్రెజిల్, మెక్సికో మ్యాచ్ డ్రా | Sakshi
Sakshi News home page

బ్రెజిల్, మెక్సికో మ్యాచ్ డ్రా

Published Wed, Jun 18 2014 4:17 AM

brazil and mexico match draw

 ఫోర్టలెజా: వరుసగా రెండో గెలుపుతో నాకౌట్ దశ అవకాశాలను సులభం చేసుకుందామనుకున్న ఆతిథ్య జట్టు బ్రెజిల్‌కు మెక్సికో గట్టి పోటీనే ఇచ్చింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా భారత కాలమాన ప్రకారం మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల నుంచి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.
 
  దీంతో 0-0తో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆట 26వ నిమిషంలో నెయ్‌మార్ హెడర్ షాట్‌ను మెక్సికో గోల్ కీపర్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. అటు మెక్సికో సైతం బ్రెజిల్ గోల్‌పోస్టుపై దాడులకు దిగినా ఫలితం దక్కలేదు. తమకు లభించిన ఫ్రీకిక్ అవకాశాలను బ్రెజిల్ సద్వినియోగం చేసుకోలేకపోయింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement