అది ఒక బాధ్యత మాత్రమే: కోహ్లి | Sakshi
Sakshi News home page

అది ఒక బాధ్యత మాత్రమే: కోహ్లి

Published Mon, Aug 26 2019 11:58 AM

Captaincy Just A Responsibility Kohli - Sakshi

ఆంటిగ్వా:  వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 318 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. సమిష్టిగా రాణించిన కోహ్లి సేన టెస్టును సునాయాసంగా సొంతం చేసుకుంది. ఈ క‍్రమంలోనే భారత్‌ తరఫున అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్‌గా ధోని సరసన చేరాడు కోహ్లి. ఇది కోహ్లికి కెప్టెన్‌గా 27వ టెస్టు విజయం కాగా, ధోని సారథ్యంలో భారత్‌ 27 విజయాల్ని సాధించింది. మ్యాచ్‌ తర్వాత ధోని రికార్డును సమం చేసిన సందర్భంగా అడిగిన ప్రశ్నకు కోహ్లి సమాధానమిస్తూ.. ‘ ‘కెప్టెన్సీ అనేది బాధ్యత.  నేను దాన్ని ఆశించిన స్థాయిలో నిర్వర్తిస్తున్నాను.  (ఇక్కడ చదవండి:భారత్‌ ఘన విజయం)

జట్టులో సమన్వయం లేకపోతే ఏదీ సాధ్యం కాదు. నేను సొంతంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని జట్టులోని ప్రతి ఒక్కరితోనూ పంచుకుంటాను’ అని కోహ్లి తెలిపాడు. ఇక మ్యాచ్‌ గెలుపులో కీలక పాత్ర పోషించిన రహానే, ఇషాంత్‌లపై కోహ్లి ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్‌ గెలుపులో రహానెది కీలక పాత్ర.  రహానే అద్భుతంగా ఆడాడు. ఇషాంత్‌ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు’ అని కొనియాడాడు. మ్యాచ్‌ను మలుపు తిప్పిన క్రెడిట్‌ ఇషాంత్‌కే దక్కుతుందన్నాడు. (ఇక్కడ చదవండి: వెస్టిండీస్‌ చెత్త రికార్డు)

Advertisement
Advertisement