మా ఆటగాళ్ల పరిస్థితి ఏమిటి?: బీసీసీఐ

24 May, 2017 01:09 IST|Sakshi

ముంబై: ఇంగ్లండ్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత క్రికెటర్ల భద్రతపై ఐసీసీతో బీసీసీఐ ఆందోళన వెలిబుచ్చింది. ‘ఉదయం లేవగానే మాంచెస్టర్‌లో ఉగ్రవాదుల దాడి గురించి విన్నాను. వెంటనే భారత క్రికెటర్ల ప్రయాణం, వసతి, మ్యాచ్‌లపై ఐసీసీ తీసుకుంటున్న భద్రతా ఏర్పాట్ల గురించి మా ఆందోళన తెలియజేసాం. అయితే రెండు గంటల్లోనే ఐసీసీ మాకు సమాధానమిచ్చింది’ అని బోర్డు కార్యదర్శి అమితాబ్‌ చౌధరి తెలిపారు. కోహ్లి నేతృత్వంలో భారత క్రికెట్‌ జట్టు నేడు (బుధవారం) ఇంగ్లండ్‌కు పయనం కానుంది.
 

మరిన్ని వార్తలు