చాంపియన్ చంచల్‌గూడ సుల్తాన్స్ | Sakshi
Sakshi News home page

చాంపియన్ చంచల్‌గూడ సుల్తాన్స్

Published Sun, Aug 14 2016 9:29 AM

చాంపియన్ చంచల్‌గూడ సుల్తాన్స్

స్లమ్ లీగ్ టి20 క్రికెట్ లీగ్
 
హైదరాబాద్: స్లమ్ లీగ్ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో చంచల్‌గూడ సుల్తాన్స్ చాంపియన్‌గా నిలిచింది. ఉప్పల్‌లోని డేనియల్ క్రికెట్ అకాడమీలో శనివారం జరిగిన ఫైనల్స్‌లో చంచల్‌గూడ సుల్తాన్స్ జట్టు, 67 పరుగుల తేడాతో ఉప్పల్ రాకెట్స్ జట్టుపై ఘన విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చంచల్‌గూడ జట్టు 18 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. కశ్యప్ (59), నిజాముద్దీన్ (46) బ్యాటింగ్‌లో రాణించారు.

ఉప్పల్ రాకె ట్స్ జట్టు బౌలర్లలో సుల్తాన్, అస్లామ్ చెరో మూడు వికె ట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఉప్పల్ రాకెట్స్ జట్టు 18 ఓవర్లలో 95 పరుగులకే అలౌటైంది. ఖదీర్ (34) పోరాడాడు. చంచల్‌గూడ బౌలర్లో మసూద్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీతో రాణించిన కశ్యప్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా... టోర్నీ ఆసాంతం ప్రతిభ కన బరిచిన నజీర్ (విద్యానగర్ గోల్డ్ జట్టు) కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ పురస్కారం లభించింది.

Advertisement
Advertisement