నన్ను బలిపశువును చేశారు: గేల్ | Sakshi
Sakshi News home page

నన్ను బలిపశువును చేశారు: గేల్

Published Sat, Jun 4 2016 7:41 PM

నన్ను బలిపశువును చేశారు: గేల్

ఆంటిగ్వా:  మహిళా టీవీ వ్యాఖ్యాతల పట్ల శృంగారపరమైన  వ్యాఖ్యలు చేసి వివాదాల్లో నిలిచిన వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్.. ఈ విషయంలో తనను కావాలనే బలిపశువును చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.  ఆనాటి వివరాల్లోకి వెళితే, తాను ఏ రకంగా మాట్లాడానో అర్థమవుతుందని గేల్   తాజాగా ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొన్నాడు.  ఈ విషయంలో మీడియా వ్యవహరించే తీరు హాస్యాస్పదంగా ఉందన్నాడు.

' నాపై ఏ కథ రాసినా నాకు అణువంత నష్టం కూడా ఉండదు. వారు రాసే కథనాలు నాపై ఎటువంటి ప్రభావం చూపలేవు. నన్ను అపహాస్యం చేయాలనే ప్రయత్నం జరుగుతుందని కచ్చితంగా చెప్పగలను. నన్ను వారు బలిపశువును చేయాలని యత్నిస్తున్నారు' అని గేల్ పేర్కొన్నారు.

జనవరిలో జరిగిన బిగ్ బాష్ లీగ్ సందర్భంగా ప్రత్యక్ష ప్రసారంలో నాతో డేటింగ్‌కు వస్తావా.. కలిసి తాగుదామంటూ మహిళా స్పోర్ట్స్ యాంకర్‌తో అసభ్యంగా వ్యవహరించిన గేల్‌.. ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కూడా ఇంగ్లండ్ టీవీ వ్యాఖ్యాతకు ఇచ్చిన ఇంటర్య్వూలో శృంగారపరమైన వ్యాఖ్యలు చేశాడు.

Advertisement
Advertisement