బ్రిడ్జ్‌టౌన్: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తన వన్డే పునరాగమనాన్ని శతకంతో ఘనంగా ప్రదర్శించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో గేల్ (129 బంతుల్లో 135; 3 ఫోర్లు, 12 సిక్సర్లు) అద్భుత సెంచరీతో చెలరేగాడు. గేల్‌కు తోడు షై హోప్ (65 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించడంతో కడపటి వార్తలందేసరికి వెస్టిండీస్ 47 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ప్రారంభించిన గేల్, ఆ తర్వాత తనదైన శైలిలో చెలరేగిపోయాడు.
తొలి 50 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేసిన అతను తర్వాతి 50 బంతుల్లో 79 పరుగులు చేసి సరిగ్గా 100 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. కుదురుకున్నాక మరింతగా విరుచుకు పడిన గేల్ సిక్సర్లు మైదానం బయట పడటంతో ఏకంగా నాలుగు సార్లు కొత్త బంతిని తీసుకోవాల్సి వచ్చింది! గేల్ వన్డే కెరీర్లో ఇది 24వ సెంచరీ. తాజా మ్యాచ్‌లో క్రిస్ గేల్ కొత్త ఘనతను నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు అఫ్రిది (476)తో సమంగా ఉండగా... ఇన్నింగ్స్‌లో కొట్టిన తొలి సిక్స్‌తోనే ఈ రికార్డు (477) గేల్ సొంతమైంది.
గేల్ సెంచరీ
Published Thu, Feb 21 2019 1:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement