కొత్త స్టార్‌ వచ్చాడు... | Sakshi
Sakshi News home page

కొత్త స్టార్‌ వచ్చాడు...

Published Mon, Aug 7 2017 12:59 AM

కొత్త స్టార్‌ వచ్చాడు...

రియో ఒలింపిక్స్‌ తర్వాత అంతగా ఫామ్‌లో లేని బోల్ట్‌కు గాట్లిన్‌ నుంచి గట్టిపోటీ ఎదురవుతుందని... అయితే గతంలో మాదిరిగానే ఈసారీ గాట్లిన్‌ను బోల్ట్‌ ఓడిస్తాడని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా బోల్ట్‌కు గాట్లిన్‌ నుంచి కాకుండా అమెరికాకే చెందిన 21 ఏళ్ల రైజింగ్‌ స్టార్‌ క్రిస్టియన్‌ కోల్మన్‌ నుంచి పోటీ ఎదురైంది.

రెండు గంటల వ్యవధిలో బోల్ట్‌ను (సెమీఫైనల్, ఫైనల్‌) రెండుసార్లు ఓడించిన కోల్మన్‌ 100 మీటర్ల విభాగంలో భవిష్యత్‌ తారగా తెరపైకి వచ్చాడు. బోల్ట్, గాట్లిన్‌ రిటైర్మెంట్‌ తర్వాత 100 మీటర్ల ఈవెంట్‌కు ఆదరణ తగ్గకుండా తాను ఉన్నానని తాజా ప్రదర్శనతో కోల్మన్‌ నిరూపించుకున్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement