అవీ... ఇవీ... అన్నీ కరోనా వల్లే!  | Sakshi
Sakshi News home page

అవీ... ఇవీ... అన్నీ కరోనా వల్లే! 

Published Sat, Mar 14 2020 2:53 AM

Corona Affected On National And International Sports - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వలయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు విలవిలలాడుతున్నాయి. ఆటలన్నీ వాయిదా లేదంటే రద్దవుతున్నాయి.  
అథ్లెటిక్స్‌ 
►భోపాల్‌లో  ఏప్రిల్‌ 6 నుంచి 8 వరకు జరగాల్సి న ఫెడరేషన్‌ కప్‌ జాతీయ జూ. టోర్నీ వాయిదా. 
►ఏప్రిల్‌ 20న జరగాల్సిన బోస్టన్‌ మారథాన్‌  సెప్టెంబర్‌ 14కు... ఏప్రిల్‌ 26న జరగాల్సిన లండన్‌ మారథాన్‌ అక్టోబర్‌ 4కు వాయిదా. 
బ్యాడ్మింటన్‌
►మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 12 మధ్యకాలంలో  వేర్వేరు వేదికలపై జరగాల్సిన స్విస్‌ ఓపెన్, ఇండియా ఓపెన్, ఓర్లీన్స్‌ మాస్టర్స్‌ ఓపెన్, మలేసియా ఓపెన్, సింగపూర్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ప్రకటించింది. 
బాస్కెట్‌బాల్‌
►ఈ నెల 18 నుంచి 22 వరకు బెంగళూరులో జరగాల్సిన ఎఫ్‌ఐబీఏ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ వాయిదా. 
చెస్‌
►మే 31 వరకు జాతీయ చెస్‌ టోర్నీలు వాయిదా 
టెన్నిస్‌
►ఆరు వారాలపాటు దేశవాళీ టోర్నమెంట్లు రద్దు
క్రికెట్‌
►ఐపీఎల్‌ ఏప్రిల్‌ 15 వరకు నిలిపివేత. 
►భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ రద్దు 
►శ్రీలంకలో ఉన్న ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు తమ 
పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా శ్రీలంకతో ఇంగ్లండ్‌ ఈ సిరీస్‌లో రెండు టెస్టులు ఆడాల్సింది.  
►పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) టి20 టోర్నీ లో ఆడుతున్న పలువురు విదేశీ క్రికెటర్లు అలెక్స్‌ హేల్స్, జేసన్‌ రాయ్, టైమల్‌ మిల్స్, లియామ్‌ డాసన్, లియామ్‌ లివింగ్‌స్టోన్, లూయిస్‌ గ్రెగెరీ, జేమ్స్‌ విన్సీ (ఇంగ్లండ్‌), కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ (వెస్టిండీస్‌), రిలీ రోసూ (దక్షిణాఫ్రికా), జేమ్స్‌ ఫాస్టర్‌ (కోచ్‌) పీఎస్‌ఎల్‌ను వీడి వారి సొంత దేశాలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.  
►మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 4 వరకు దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సిన ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్టు ఈ పర్యటనను రద్దు చేసుకుంది. ఈ సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా జట్టు మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడాల్సింది.  
ఫుట్‌బాల్‌
►అట్లెటికో కోల్‌కతా, చెన్నైయిన్‌ ఎఫ్‌సీ జట్ల మధ్య గోవాలో నేడు జరగాల్సిన ఫైనల్‌ ప్రేక్షకులు లేకుండా గప్‌చుప్‌గా నిర్వహణ. 
►ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఈపీఎల్‌) ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు ఏప్రిల్‌ 4 వరకు వాయిదా. ఈపీఎల్‌లో పాల్గొనే అర్సెనల్‌ జట్టు మేనేజర్‌ మికెల్‌ అర్టెటా, చెల్సీ జట్టు సభ్యుడు కాలమ్‌ హడ్సన్‌లు కోవిడ్‌–19 బారిన పడ్డారు.  
►భారత్, ఖతర్‌ ఫుట్‌బాల్‌ మధ్య భువనేశ్వర్‌లో ఈ నెల 26న... భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య కోల్‌కతాలో జూన్‌ 9న జరగాల్సిన ‘ఫిఫా’ ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు వాయిదా. 
►ఐజ్వాల్‌లో వచ్చే నెల 14 నుంచి 27 వరకు జరగాల్సిన సంతోష్‌ ట్రోఫీ ఫుట్‌బాల్‌ ఫైనల్‌ రౌండ్‌ పోటీలు వాయిదా 
గోల్ఫ్‌
►ఇండియా ఓపెన్‌ (న్యూఢిల్లీలో 19–22 వరకు) వాయిదా 
►ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా (పీజీటీఐ)  టోర్నీలన్నీ నిరవధికంగా వాయిదా 
షూటింగ్‌
►ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ (న్యూఢిల్లీలో ఈ నెల 15–25) వాయిదా 
ఫార్ములావన్‌
►మార్చి 15న ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి, మార్చి 22న బహ్రెయిన్, ఏప్రిల్‌ 5న జరగాల్సిన వియత్నాం గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ రేసులు రద్దు.  
టేబుల్‌ టెన్నిస్‌
►ఏప్రిల్‌ చివరి వారం వరకు అన్ని అంతర్జాతీయ టోర్నీలు రద్దు చేస్తున్నట్లు అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) ప్రకటించింది.

Advertisement
Advertisement