Sakshi News home page

Published Thu, Apr 5 2018 2:15 PM

Counter Post to Afridi Over IOK Comments - Sakshi

పాక్‌ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది కశ్మీర్‌ అంశంలో చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో చర్చ ఇప్పట్లో ముగిసేలా కనిపించటం లేదు. భారత్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పరిస్థితి దారుణంగా ఉందంటూ అఫ్రిది చేసిన ట్వీట్‌పై ఇప్పటికే భారత క్రికెటర్లంతా ఘాటు బదులుతో ఏకీపడేశారు. అయితే బూమ్‌ బూమ్‌(అఫ్రిది)కి ఇప్పుడు స్వదేశంలోనూ కౌంటర్‌లు పడుతుండటం విశేషం. 

‘అఫ్రిది కశ్మీర్‌పై నువ్వు చేసిన ట్వీట్‌ను చూస్తుంటే నవ్వాగట్లేదు. నువ్వు ఎక్కడ పుట్టావ్? ఖైబర్‌ ప్రాంతంలోని పష్టున్లకు చెందిన అఫ్రిది గిరిజన తెగలో జన్మించావ్‌. పాక్‌ ఆర్మీ పష్టున్లపై చేస్తున్న దమనకాండ ఏనాడైనా నీ కంటికి కనిపించిందా? మహిళలపై అఘాయిత్యాలు, చిన్న పిల్లలు.. యువకులను బానిసలుగా మార్చి హింసిస్తున్న ఘటనలు కళ్లకు కనిపించటం లేదా? నీ సొంత ప్రాంతం.. సొంత వాళ్ల గురించి ఏనాడూ స్పందించాలని నీకు అనిపించలేదా?. గాజు మేడలో ఉండి ఇతరుల ఇళ్లపై రాళ్లేయాలని చూడకూడదు’ అంటూ ఓ పోస్ట్‌ పాక్‌లో చక్కర్లు కొడుతోంది.

ఇక నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలాను కూడా ఉద్దేశించి మరో పోస్ట్‌ హల్‌ చల్‌ చేస్తోంది. బెలూచిస్థాన్‌లో పాక్‌ ఆర్మీ పాల్పడుతున్న ఘాతుకాలపై ఆమె ఎందుకు స్పందించట్లేదు? అంటూ అందులో ఉంది.

Advertisement
Advertisement