ఆసీస్ అలవోకగా... | Sakshi
Sakshi News home page

`ఆసీస్ అలవోకగా...

Published Sun, Mar 15 2015 12:50 AM

ఆసీస్ అలవోకగా...

స్కాట్లాండ్‌పై ఘన విజయం
 
హోబర్ట్: ఓవైపు స్వల్ప లక్ష్యం... మరోవైపు వర్షం ముప్పు... ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే క్వార్టర్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడాల్సిన పరిస్థితి... ఇలాంటి స్థితిలో ఆస్ట్రేలియా బౌలర్లు ఆరంభంలో హడలెత్తించగా... ఆ తర్వాత బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు. ఫలితంగా ఆస్ట్రేలియా 208 బంతులు మిగిలి ఉండగానే అలవోక విజయాన్ని అందుకుంది. ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న కంగారూలు శనివారం జరిగిన గ్రూప్ ‘ఎ' లీగ్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌ను ఓడించారు. ఆసీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 25.4 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది.

పేసర్లు మిచెల్ స్టార్క్ (4/14), కమిన్స్ (3/42) పకడ్బందీ బౌలింగ్‌తో స్కాట్లాండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. ఆస్ట్రేలియా 15.2 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి నెగ్గింది. కెప్టెన్ క్లార్క్ (47 బంతుల్లో 47; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడును చూపెట్టాడు. ఆసీస్ స్కోరు 92/3 ఉన్న దశలో వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. వర్షం వెలిశాక... ఆసీస్ బ్యాట్స్‌మెన్ తొందరగా మ్యాచ్‌ను ముగించారు. స్టార్క్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
 
స్కోరు వివరాలు
స్కాట్లాండ్ ఇన్నింగ్స్: కోట్జర్ (సి) స్మిత్ (బి) స్టార్క్ 0; మెక్లీయోడ్ (సి) వార్నర్ (బి) స్టార్క్ 22; మకన్ (సి) ఫాల్క్‌నర్ (బి) కమిన్స్ 40; మమ్‌సేన్ (సి) స్టార్క్ (బి) వాట్సన్ 0; కోల్మెన్ (సి) క్లార్క్ (బి) జాన్సన్ 0; బెరింగ్టన్ (సి) వార్నర్ (బి) మ్యాక్స్‌వెల్ 1; క్రాస్ (సి) హాడిన్ (బి) కమిన్స్ 9; డేవి (బి) స్టార్క్ 26; టేలర్ (సి) హాడిన్ (బి) కమిన్స్ 0; లిస్క్ నాటౌట్ 23; వార్డ్‌లా (బి) స్టార్క్ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (25.4 ఓవర్లలో ఆలౌట్) 130.

 వికెట్ల పతనం: 1-8; 2-36; 3-37; 4-50; 5-51; 6-78; 7-79; 8-95; 9-130; 10-130.
 బౌలింగ్: స్టార్క్ 4.4-1-14-4; కమిన్స్ 7-1-42-3; వాట్సన్ 3-0-18-1; జాన్సన్ 4-1-16-1; మ్యాక్స్‌వెల్ 4-0-24-1; ఫాల్క్‌నర్ 3-0-15-0.

 ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: క్లార్క్ (సి) లిస్క్ (బి) వార్డ్‌లా 47; ఫించ్ (సి) కోల్మెన్ (బి) టేలర్ 20; వాట్సన్ (సి) క్రాస్ (బి) డేవి 24; ఫాల్క్‌నర్ నాటౌట్ 16; వార్నర్ నాటౌట్ 21; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (15.2 ఓవర్లలో 3 వికెట్లకు) 133.

 వికెట్ల పతనం: 1-30; 2-88; 3-92.
 బౌలింగ్: వార్డ్‌లా 5-0-57-1; టేలర్ 5-0-29-1; డేవి 5-1-38-1; లిస్క్ 0.2-0-7-0.

Advertisement
Advertisement