డే అండ్ నైట్ టెస్టులపై హ్యపీ! | Sakshi
Sakshi News home page

డే అండ్ నైట్ టెస్టులపై హ్యపీ!

Published Thu, Jul 2 2015 12:17 AM

డే అండ్ నైట్ టెస్టులపై హ్యపీ! - Sakshi

స్వాగతించిన ఎంసీసీ
  లండన్: టెస్టు క్రికెట్‌లో డే అండ్ నైట్ మ్యాచ్‌ల నిర్వహణను మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) స్వాగతించింది. ప్రపంచ క్రికెట్ నిబంధనల కేంద్రమైన ఎంసీసీ, టెస్టుల్లో దీనిని కొత్త మలుపుగా పేర్కొంది. ఈ ఏడాది నవంబర్ 27 నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య అడిలైడ్‌లో తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గులాబీ రంగు కూకాబుర్రా బంతిని వాడతారు. 2008లోనే ఐసీసీ గులాబీ బంతులను మ్యాచ్‌లో ఉపయోగించింది.
 
 ‘టెస్టు క్రికెట్‌లో ఇది మరో కొత్త అధ్యాయం. తాజా నిర్ణయం మాకు సంతోషం కలిగించింది. డే అండ్ నైట్ టెస్టులు, పింక్ బంతుల వినియోగంపై ఎంసీసీ ఎన్నో పరిశోధనలు చేసింది. ఇప్పుడు అది వాస్తవరూపం దాలుస్తోంది’ అని ఎంసీసీ హెడ్ ఆఫ్ క్రికెట్ జాన్ స్టీఫెన్సన్ వెల్లడించారు.
 

Advertisement
Advertisement