ముంబైకి చావో రేవో | Sakshi
Sakshi News home page

ముంబైకి చావో రేవో

Published Sun, May 15 2016 7:45 PM

ముంబైకి చావో రేవో

విశాఖపట్నం: ఐపీఎల్-9లో భాగంగా ఆదివారమిక్కడ జరుగుతున్న 47వ లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ జహీర్ ఖాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు. విశాఖలో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన ముంబైకు నేటి మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో నెగ్గితో ఆత్మవిశ్వాసంతో ప్లేఆప్‌ కు చేరువవుతుంది.

ఢిల్లీ టీమ్ కూడా ఈ మ్యాచ్ కీలకం. పాయింట్ల పట్టికలో ఢిల్లీ నాలుగు, ముంబై ఐదో స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ టీమ్ లో మూడు మార్పులు జరిగాయి. జయంత్ యాదవ్, నాథన్ కౌంటర్-నిలె, మహ్మద్ షమీ స్థానంలో ఢిల్లీ టీమ్ లో జహీర్ ఖాన్, నదీం, తాహిర్ జట్టులోకి వచ్చారు. గత మ్యాచ్ లో ఢిల్లీకి డుమిని కెప్టెన్ గా వ్యవహరించాడు.

ముంబై టీమ్ లో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. ఉన్ముక్త్ చాంద్ స్థానంలో మార్టిన్ గప్టిల్.. సౌతీ ప్లేస్ లో వినయ్ కుమార్ జట్టులోకి వచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement