ఐపీఎల్‌లో అరుదైన సందర్భం | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌లో అరుదైన సందర్భం

Published Mon, Apr 16 2018 10:45 PM

Delhi Daredevils some lovely bowling against KKR - Sakshi

కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో అరుదైన సందర్భం చోటు చేసుకుంది. సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తన బౌలింగ్‌ను మెయిడిన్‌ ఓవర్‌తో ప్రారంభించడమే కాకుండా చివరి ఓవర్‌కు ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి ముగించింది. ఇదొక అరుదైన సందర్భంగా నిలిచింది.

ఢిల్లీ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా సంధించి.. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో తొలి మెయిడిన్‌ ఓవర్‌ వేసిన ఘనతను సాధించాడు. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా క్రిస్‌ లిన్‌-సునీల్‌ నరైన్‌లు ఆరంభించిన క్రమంలో బౌల్ట్‌ పరుగులేమీ ఇవ్వకుండా నియంత్రించాడు. స్టార్‌ ఆటగాడు క్రిస్‌ లిన్‌ స్టైకింగ్‌ ఎండ్‌లో ఉండగా బౌల్ట్‌ గుడ్‌ లెంగ్త్‌ బంతులతో ఆకట్టుకని తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా వేశాడు.

ఇదిలా ఉంచితే, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఆఖరి ఓవర్‌ను కూడా కట్టుదిట్టంగా వేయడం ఇక్కడ విశేషం. ఢిల్లీ స్సిన్నర్‌ రాహుల్‌ తెహాతియా చివరి ఓవర్‌ను అందుకుని పరుగు మాత్రమే ఇచ్చాడు. 20 ఓవర్‌లో కేకేఆర్‌ ఆటగాడు కుర్రాన్‌ పరుగు తీయగా, రెండో బంతికి శుభ్‌మాన్‌ గిల్‌ పెవిలియన్‌ చేరాడు. ఇక మూడో, నాలుగు బంతులకు పీయూష్‌ చావ్లా పరుగులేమీ తీయకపోగా, ఐదో బంతికి అవుటయ్యాడు. ఆరో బంతికి కుర్రాన్‌ను అవుట్‌ కావడంతో మూడో వికెట్‌ను తెహాతియా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఓవర్‌లో పరుగు మాత‍్రమే సమర్పించుకున్నాడు. దాంతో తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా, చివరి ఓవర్‌లో పరుగు మాత్రమే ఇచ్చిన ఘనతను ఢిల్లీ సొంతం చేసుకుంది.

Advertisement
Advertisement