'శామ్యూల్స్ ను ఒత్తిడిలోకి నెట్టాలనుకోలేదు' | Sakshi
Sakshi News home page

'శామ్యూల్స్ ను ఒత్తిడిలోకి నెట్టాలనుకోలేదు'

Published Mon, Apr 4 2016 6:53 PM

'శామ్యూల్స్ ను ఒత్తిడిలోకి నెట్టాలనుకోలేదు'

కోల్కతా: వెస్టిండీస్ క్రికెట్ జట్టు వరల్డ్ టీ 20 ట్రోఫీని సాధించడంలో కార్లోస్ బ్రాత్ వైట్ పాత్ర మరువలేనిది. చివరి ఓవర్లో విజయానికి 19 పరుగులు చేయాల్సిన తరుణంలో 4 వరుస సిక్సర్లు బాది ఇంకా రెండు బంతులుండగానే జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అయితే తాను హార్డ్ హిట్టింగ్ చేయడానికి ముందుగానే సిద్దమైనట్లు బ్రాత్ వైట్ తాజాగా వెల్లడించాడు. అది ఆఖరి ఓవర్ కావడంతో ఆ సమయంలో మార్లోన్ శామ్యూల్స్ ఒత్తిడిలోకి నెట్టకుండా తానే రిస్క్ తీసుకుని హిట్టింగ్ చేసినట్లు తెలిపాడు.


'20 ఓవర్కు ముందు నేను-శామ్యూల్స్ మాట్లాడుకున్నాం. ఏది ఏమైనా బంతుల్ని వృథా చేయకూడదని నిర్ణయించుకున్నాం. తొలి బంతిని కనీసం హిట్ చేస్తే పరుగు తీస్తానని శామ్యూల్స్ చెప్పాడు. అయితే ఆ క్లిష్ట సమయంలో సింగిల్స్ తీసి మార్లోన్కు స్ట్రైకింగ్ ఇవ్వదలుచుకోలేదు. శామ్యూల్స్ కు స్ట్రైకింగ్ ఇచ్చి అతన్ని ఒత్తిడిలోకి నెట్టాలనుకోలేదు. నేనే క్రీజ్లో ఉండి చావో రేవో తేల్చుకోవాలనుకున్నా. బంతిని క్షణ్ణంగా పరిశీలించి బలంగా బాదాలనుకున్నా. మొదటి మూడు సిక్సర్లు కొట్టిన సమయంలో మా విజయానికి ఒక పరుగు మాత్రమే అవసరమనే విషయం నాకు తెలుసు. అయినప్పటికీ ఆ మరుసటి బంతిని బౌండరీ దాటిస్తేనే మేలనుకున్నా. ఆ సమయంలో ఎవరైనా రనౌట్ అయితే  మ్యాచ్ చేజారిపోయి ప్రమాదం ఉందనే అలా చేశా.  అదృష్టం కొద్దీ నా వ్యూహం ఫలించింది' అని బ్రాత్ వైట్ స్పష్టం చేశాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement