నార్త్ ఈస్ట్‌పై ముంబై విజయం

8 Oct, 2016 00:27 IST|Sakshi
నార్త్ ఈస్ట్‌పై ముంబై విజయం

ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీ వరుసగా రెండో విజయం సాధించింది. శుక్రవారం ముంబైలోనే నార్త్ ఈస్ట్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 1-0తో విజయం సాధించింది.

ముంబైకి 55వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను ఫోర్లాన్ గోల్‌గా మలిచాడు. మ్యాచ్ మొత్తం నార్త్ ఈస్ట్ అనేక అవకాశాలు సృష్టించుకున్నా... వాటిని గోల్స్‌గా మలచడంలో విఫలమైంది. సీజన్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన నార్త్ ఈస్ట్‌కు ఇది తొలి ఓటమి.

మరిన్ని వార్తలు