భారత్‌కు కోచ్ అవసరం లేదు | Sakshi
Sakshi News home page

భారత్‌కు కోచ్ అవసరం లేదు

Published Fri, May 29 2015 1:06 AM

భారత్‌కు కోచ్ అవసరం లేదు

ముంబై : భారత క్రికెట్‌లో అందరూ స్టార్ ఆటగాళ్లేనని, ప్రత్యేకంగా వారికి కోచ్ అవసరం లేదని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. వచ్చే వారం జట్టు ప్రధాన కోచ్‌తో పాటు టీమ్ హై పెర్ఫామెన్స్ మేనేజర్ ఎంపికను బీసీసీఐ చేపట్టనున్న విషయం తెలిసిందే. ఇందులో గంగూలీ పేరు కూడా వినిపిస్తోంది. అయితే జట్టుకు మరో హై ప్రొఫైల్ వ్యక్తిని ఎంపిక చేయాల్సిన అవసరం లేదని కపిల్ అన్నారు. ‘నా దృష్టిలో ఒక్క జట్టు తరఫున చాలా మంది మాజీ ఆటగాళ్లు పనిచేయడం అనవసరం.

నిజానికి ఓ మంచి కెప్టెన్, జట్టు అవసరాలను పర్యవేక్షించేందుకు మాత్రమే ఓ మాజీ క్రికెటర్ అవసరం. అంతే కానీ కోచ్‌గా మాత్రం కాదు. ఆటగాళ్లు సూపర్ స్టార్స్ అయినప్పుడు ఇంకా హైఫై కోచ్ ఉంటే సమస్యలు వస్తాయి. ప్రస్తుత స్థితిలో జట్టుకు కోచ్ అవసరం లేదు’ అని కపిల్ అన్నారు. మరోవైపు కోచ్ పదవి కోసం మరోసారి గ్యారీ కిర్‌స్టెన్‌ను బోర్డు సంప్రదించినట్టు సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement