‘డ్రా’ దిశగా శ్రీలంక, పాక్ మూడో టెస్టు

20 Jan, 2014 02:27 IST|Sakshi

షార్జా: పాకిస్థాన్, శ్రీలంకల మధ్య జరుగుతున్న మూడో టెస్టు డ్రా దిశగా పయనిస్తోంది. ఆదివారం నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి లంక రెండో ఇన్నింగ్స్‌లో 71 ఓవర్లలో 5 వికెట్లకు 133 పరుగులు చేసింది.
 
  మాథ్యూస్ (14 బ్యాటింగ్), ప్రసన్న జయవర్ధనే (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం లంక 220 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు 291/6 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 109.1 ఓవర్లలో 341 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో జయవర్ధనే టెస్టుల్లో 11 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రికెటర్‌గా అతను నిలిచాడు.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా