ఫ్లెచర్ ను పక్కన పెట్టిన రవిశాస్త్రి! | Sakshi
Sakshi News home page

ఫ్లెచర్ ను పక్కన పెట్టిన రవిశాస్త్రి!

Published Tue, Feb 17 2015 7:18 PM

ఫ్లెచర్ ను పక్కన పెట్టిన రవిశాస్త్రి!

అడిలైడ్:టీమిండియా జట్టులో రవిశాస్త్రి పెత్తనం కొనసాగుతుందా? రవిశాస్త్రి డైరెక్టర్ బాధ్యతలను వదిలి కోచ్ గా అవతారమెత్తాడా?అంటే తాజా పరిణామాలను పరికిస్తే అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం టీమిండియా వరల్డ్ కప్ టూర్ లో టీమ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి అదనంగా కోచ్ బాధ్యతలను తనపై వేసుకోవడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. టీమిండియా ప్రస్తుత కోచ్ డంకెన్ ఫ్లెచర్ ను ప్రక్కకు పెట్టి మరీ ఆటగాళ్లతో వ్యూహ రచన చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

మంగళవారం టీమిండియా సభ్యులతో రవిశాస్త్రి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం.. అందుకు ఫ్లెచర్ ను పిలవకపోవడం ఆసక్తికరంగా మారింది. వరల్డ్ కప్ టూర్ లో ఫ్లెచర్ ను పట్టించుకోకుండా రవిశాస్త్రి వ్యవహరించడం కాస్తా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement