కరోనా టెస్టింగ్‌ సెంటర్‌గా క్రికెట్‌​ స్టేడియం..!

3 Apr, 2020 17:33 IST|Sakshi

బర్మింగ్‌హమ్‌: కరోనా వైరస్‌ నియంత్రణకు ఏమి చేయాలో తెలియక  ప్రపంచ మొత్తం అల్లాడుతోంది. దీన్ని ఎలా నియంత్రించాలో తెలియక వరల్డ్‌ అంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోతే, కరోనా వైరస్‌ మాత్రం ఎక్కడా కూడా తగ్గుముఖం పట్టిన దాఖలు కనబడుటం లేదు. ఈ వైరస్‌ నివారణకు వ్యాక్సిన్‌ తయారీల కోసం పలు దేశాలు తమ ప్రయత్నాలను ఇప్పటికే ముమ్మరం చేయగా,  ప్రస్తుత పరిస్థితిల్లో కరోనా బాధితులు గణనీయంగా పెరిగిపోతూ ఉండటంతో టెస్టుల కోసం పలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. కరోనా బాధితులకు కేవలం ఆస్పత్రిల్లోనే చికిత్స చేయడం సాధ్య పడదు కాబట్టి, రైళ్లు, స్పోర్ట్స్‌ అకాడమీలు ఇలా ప్రతీ దాన్ని వినియోగించుకునే పనిలో ఉన్నాయి ప్రపంచ దేశాలు.

ఇంగ్లండ్‌లో ఏకంగా ఒక క్రికెట్‌ స్టేడియాన్నే సిద్ధం చేశారు. ప్రముఖ ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియాన్నికోవిడ్‌-19 టెస్టింగ్‌ సెంటర్‌గా మార్చే యోచనలో ఉన్నారు. నేషనల్‌  హెల్త్‌ సర్వీసుల్లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియాన్ని కరోనా వైరస్‌ టెస్టింగ్‌ సెంటర్‌గా మార్చడానికి కసరత్తులు పూర్తి చేసినట్లు వార్విక్‌షైర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నీల్‌ స్నో బాల్‌  తెలిపారు. ‘ మా దేశంలో క్రికెట్‌ సంబంధిత కార్యక్రమాలు, సమావేశాలు, ఈవెంట్స్‌, వ్యాపార కార్యకలాపాలు అన్నీ కూడా మే 29వరకూ బంద్‌ చేశాం. ఈ క్లిష్ట సమయంలో మా సిబ్బంది అంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండటంపైనే దృష్టి సారించింది. దీనికి మా మాజీ ఆటగాళ్ల సాయం కూడా తీసుకుంటున్నాం. ఎడ్జ్‌బాస్టన్‌ను కరోనా వైరస్‌ సెంటర్‌గా మార్చడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం. ఇందుకు అనుమతి లభించిన వెంటనే ఇక్కడ కరోనా టెస్టింగ్‌ సెంటర్‌ అందుబాటులోకి వస్తుంది’ అని  నీల్‌ స్నో బాల్‌  తెలిపారు.

ఇక్కడ చదవండి:

యువీ, భజ్జీ.. సాయం చేయండి: మాజీ క్రికెటర్‌

అత్యధిక ధర ఆటగాడి ఎదురుచూపులు..!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు