యూరో వార్ | Sakshi
Sakshi News home page

యూరో వార్

Published Wed, Jun 8 2016 11:40 PM

యూరో వార్ - Sakshi

మరో సాకర్ సమరానికి రంగం సిద్ధమైంది. ప్రపంచకప్ తర్వాత ఏ వేదికపై రాణిస్తే విశ్వవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని ప్రతి ఫుట్‌బాల్ క్రీడాకారుడు భావిస్తాడో ఆ పండగ రానే వచ్చింది. ఫ్రాన్స్ వేదికగా ‘యూరో’ చాంపియన్‌షిప్ ఫుట్‌బాల్ పోటీలకు రేపు (శుక్రవారం) తెరలేవనుంది. 10 స్టేడియాలు... 51 మ్యాచ్‌లు... 24 జట్లు... విఖ్యాత ఆటగాళ్ల విన్యాసాలు... లక్షలాది ప్రేక్షకులు... కోట్లాది రూపాయాల ప్రైజ్‌మనీ... ఇలా ప్రతి అంశం ఈసారి యూరో చాంపియన్‌షిప్‌ను ఆకట్టుకునేలా చేశాయి.

ఇంగ్లండ్ జట్టుకు ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఉన్న ‘యూరో’ ఈసారైనా అందుతుందా? గత రెండు పర్యాయాల్లో విజేతగా నిలిచిన స్పెయిన్ ఈసారీ నెగ్గి ‘హ్యాట్రిక్’ సాధిస్తుందా? రెండు దశాబ్దాలుగా ఈ ట్రోఫీని ముద్దాడలేకపోతున్న ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జర్మనీ ఈసారైనా తమ లక్ష్యాన్ని సాధిస్తుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మరో నెల రోజులు ఓపిక పట్టాల్సిందే.
 
 
యూరోప్ ఖండంలో ఫుట్‌బాల్ రారాజు ఎవరో తేల్చేందుకు నాలుగేళ్లకోసారి ‘యూరో’ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తారు. 1960లో ఫ్రాన్స్ వేదికగా తొలిసారి ‘యూరో’ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నిరాటంకంగా కొనసాగుతోంది. స్పెయిన్ మినహా మరే జట్టు యూరో టైటిల్‌ను రెండోసారి నిలబెట్టుకోలేదు. ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ తప్ప ఏ ఆతిథ్య దేశం యూరో చాంపియన్‌గా నిలువలేదు.


నెదర్లాండ్స్‌కు దక్కని చోటు  మొదట్లో ఆదరణ అంతంత మాత్రంగానే ఉన్నా ... యూరో నెమ్మదిగా పుంజుకుంది. మొదట్లో కేవలం నాలుగు జట్ల మధ్య జరిగిన ఈ మెగా ఈవెంట్ ఈసారి 24 జట్లకు చేరింది. ప్రపంచకప్ ముగిసిన వెంటనే ‘యూరో’ క్వాలిఫయింగ్ పోటీలు మొదలవుతాయి. ఆతిథ్య దేశం మినహా యూరోప్‌లోని మిగతా 53 దేశాలు క్వాలిఫయింగ్ పోటీలు ఆడాల్సి ఉంటుంది.  కేవలం 30 వేల జనాభా ఉన్న జిబ్రాల్టర్ దేశం తొలిసారి ‘యూరో’ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడింది. పోటీ తీవ్రత దృష్ట్యా మాజీ చాంపియన్ నెదర్లాండ్స్ ఈసారి ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధించకపోవడం గమనార్హం.


 32 ఏళ్ల తర్వాత....
 మూడు దశాబ్దాల తర్వాత ఫ్రాన్స్ మరోసారి ‘యూరో’కు వేదికగా నిలువనుంది. ఈసారి యూరో నిర్వహించేందుకు ఫ్రాన్స్‌తోపాటు ఇటలీ, టర్కీ, నార్వే, స్వీడన్ దేశాలు పోటీపడ్డాయి. తుదకు ఫ్రాన్స్‌కు మూడోసారి ఆతిథ్య భాగ్యం దక్కింది. గతంలో ఫ్రాన్స్ 1960, 1984లలో యూరో నిర్వహించింది.

1996-యూరో తర్వాత మళ్లీ ఈ మెగా చాంపియన్‌షిప్‌లో మరోసారి ప్రధాన టోర్నమెంట్‌లో 24 జట్లు తలపడుతున్నాయి. మొత్తం 24 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక ఆరు గ్రూప్‌ల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన 12 జట్లు... మూడో స్థానంలో నిలిచిన నాలుగు అత్యుత్తమ జట్లు నాకౌట్ (ప్రిక్వార్టర్ ఫైనల్స్) దశకు అర్హత పొందుతాయి. ‘యూరో’ చాంపియన్‌గా నిలిచిన జట్టు రష్యాలో 2017లో జరిగే కాన్ఫెడరేషన్స్ కప్ (మినీ వరల్డ్‌కప్)కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జర్మనీ, రష్యా గనుక విజేతగా నిలిస్తే రన్నరప్‌గా నిలిచిన జట్టుకు కాన్ఫెడరేషన్స్ కప్ బెర్త్ ఖాయమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే జర్మనీ, రష్యా కాన్ఫెడరేషన్స్ కప్‌కు అర్హత పొందాయి.-సాక్షి క్రీడావిభాగం
 
 
2 యూరో టోర్నీ టైటిల్‌ను అత్యధికంగా మూడుసార్లు చొప్పున స్పెయిన్ (1964, 2008, 2012), జర్మనీ (1972, 1980, 1996) సాధించాయి.
 
552  ఈసారి యూరోలో బరిలోకి దిగుతున్న మొత్తం ఆటగాళ్ల సంఖ్య.
 
43  ఈ మెగా ఈవెంట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్టు జర్మనీ.
 
 5 యూరో టోర్నీలో తొలిసారి పాల్గొంటున్న జట్ల సంఖ్య (అల్బేనియా, ఐస్‌లాండ్, నార్నర్త్ ఐర్లాండ్, స్లొవేకియా, వేల్స్).
 
4 యూరోలో బరిలోకి దిగిన తొలిసారే టైటిల్ సాధించిన జట్ల సంఖ్య (సోవియట్ యూనియన్-1960, స్పెయిన్-1964, ఇటలీ-1968,   జర్మనీ-1972).
 
 
 క్వార్టర్ ఫైనల్స్
 45.     జూన్ 30    మ్యాచ్-37 విజేత x మ్యాచ్-39 విజేత     రా.గం. 12.30 నుంచి
 46.     జులై 1     మ్యాచ్-38 విజేత x మ్యాచ్-42 విజేత     రా.గం. 12.30 నుంచి
 47.     జులై 2     మ్యాచ్-41 విజేత xమ్యాచ్-43 విజేత     రా.గం. 12.30 నుంచి
 48.     జులై 3     మ్యాచ్-40 విజేతx మ్యాచ్-44 విజేత     రా.గం. 12.30 నుంచి

 సెమీఫైనల్స్
 49.     జులై 6     మ్యాచ్-45 విజేత xమ్యాచ్-46 విజేత     రా.గం. 12.30 నుంచి
 50.     జులై 7     మ్యాచ్-47 విజేత xమ్యాచ్-48 విజేత     రా.గం. 12.30 నుంచి
 ఫైనల్
 51.     జులై 10     మ్యాచ్-49 విజేతx మ్యాచ్-50 విజేత     రా.గం. 12.30 నుంచి
 
 కాసుల వర్షం...
యూరో’లో పాల్గొంటున్న 24 జట్లకు పార్టిసిపేషన్ ఫీజు కింద ఒక్కో జట్టుకు 80 లక్షల యూరోల (రూ. 60 కోట్ల 69 లక్షలు) చొప్పున అందజేస్తారు. గ్రూప్ దశలో ఒక్కో విజయానికి 10 లక్షల యూరోలు (రూ. 7 కోట్ల 58 లక్షలు)  లభిస్తాయి. ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్న 16 జట్లకు 15 లక్షల యూరోల (రూ. 11 కోట్ల 37 లక్షలు) చొప్పున ఇస్తారు. క్వార్టర్ ఫైనల్ చేరుకున్న 8 జట్లకు 25 లక్షల యూరోల (రూ. 18 కోట్ల 96 లక్షలు) చొప్పున అందజేస్తారు. సెమీఫైనల్స్‌కు చేరుకున్న జట్ల ఖాతాలో 40 లక్షల యూరోల (రూ. 30 కోట్ల 34 లక్షలు) చొప్పున చేరుతాయి. రన్నరప్‌కు 50 లక్షల యూరోలు (రూ. 37 కోట్ల 93 లక్షలు), విజేతకు 80 లక్షల యూరోలు (రూ. 60 కోట్ల 69 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కుతుంది.
 
 
యూరో -2016 షెడ్యూల్
 


గ్రూప్-అ  
ఫ్రాన్స్
రుమేనియా
అల్బేనియా
స్విట్జర్లాండ్
 
 
 గ్రూప్-ఆ
 
ఇంగ్లండ్
రష్యా
వేల్స్
స్లొవేకియా
 
గ్రూప్-ఇ
 
జర్మనీ
ఉక్రెయిన్ పోలాండ్
నార్తర్న్ ఐర్లాండ్
 
గ్రూప్-ఈ
 

స్పెయిన్
చెక్ రిపబ్లిక్
టర్కీ
క్రొయేషియా
 
గ్రూప్-ఉ
బెల్జియం
ఇటలీ
ఐర్లాండ్
స్వీడన్
 
గ్రూప్-ఊ

పోర్చుగల్
ఐస్‌లాండ్ ఆస్ట్రియా
హంగేరి
 
షెడ్యూల్ భారత కాలమానం ప్రకారం
 మ్యాచ్‌లన్నీ సోనీ సిక్స్,  సోనీ ఈఎస్‌పీఎన్‌లో  ప్రత్యక్ష ప్రసారం

Advertisement
Advertisement