టీమిండియా పేస్ త్రయంతో జాగ్రత్త! | Sakshi
Sakshi News home page

టీమిండియా పేస్ త్రయంతో జాగ్రత్త!

Published Tue, Mar 24 2015 11:55 AM

టీమిండియా పేస్ త్రయంతో జాగ్రత్త!

సిడ్నీ:గతంలో కంటే వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా పేస్ బాగా బలంగా ఉందని ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ స్పష్టం చేశాడు. టీమిండియా పేస్ త్రయం ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మలు బౌలింగ్ లో విశేషంగా రాణిస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నాడు. వారి పేస్ ఆసీస్ తో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ ల్లో టీమిండియాకు విజయం చేకూర్చే పెట్టే అవకాశం కూడా లేకపోలేదని బ్రెట్ లీ తెలిపాడు.

 

టీమిండియా పేస్ తో ఆస్ట్రేలియా జాగ్రత్తగా ఉండాలన్నాడు. ఇప్పటివరకూ వరల్డ్ కప్ మ్యాచ్ ల్లో టీమిండియా 70 వికెట్లు తీస్తే 42 వికెట్లు ఫాస్ట్ బౌలింగ్ ఖాతాలో పడిన సంగతిని బ్రెట్ లీ గుర్తు చేశాడు. వారు 145 కి.మీ వేగంతో బౌలింగ్ చేయడం టీమిండియాకు కలిసొచ్చే అంశంగా తెలిపాడు. ప్రస్తుతం టీమిండియా అటు బ్యాటింగ్, బౌలింగ్ లో చాలా బలంగా ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. తనను జట్టుకు ఎప్పుడు ఆడమన్నా ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు లీ స్పష్టం చేశాడు.

Advertisement
Advertisement