9 డాలర్ల బెట్టింగ్: మహిళా క్రికెటర్ సస్పెన్షన్ | Sakshi
Sakshi News home page

9 డాలర్ల బెట్టింగ్: మహిళా క్రికెటర్ సస్పెన్షన్

Published Tue, Dec 22 2015 7:00 PM

9 డాలర్ల బెట్టింగ్: మహిళా క్రికెటర్ సస్పెన్షన్

సిడ్నీ: ఈ ఏడాది ఆరంభంలో జరిగిన క్రికెట్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళా క్రికెటర్ స్వల్ప మొత్తంలో బెట్టింగ్ కు పాల్పడి రెండు సంవత్సరాల పాటు బహిష్కరణకు గురైంది.  వివరాల్లోకి వెళితే..  వన్డే వరల్డ్ కప్ లో భాగంగా మార్చి 29వ తేదీన ఆసీస్-కివీస్ ల మధ్య జరిగిన  ఫైనల్ మ్యాచ్ పై  ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ అంజెలా రీక్స్ కేవలం 9 డాలర్లు పందెం కాసింది. అది కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఎవరు గెలుస్తారనే దానిపై బెట్టింగ్ వేసింది.

 

అది ఆమె సరదాగా చేసినట్లు మనకు కనబడుతున్నా.. దీనిపై ఆస్ట్రేలియా క్రికెట్ అవినీతి నిరోధక శాఖ మాత్రం  సీరియస్ గా దృష్టి పెట్టింది. ఈ ఘటనపై విచారణ జరిపిన అనంతరం అంజెలా తప్పు చేసినట్లు ధృవీకరించింది.  దీంతో  ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆమెను తీవ్రంగా మందలించిన పిదప రెండు సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మహిళల బిగ్ బాష్ లీగ్ లో  సిడ్నీ సిక్సర్స్ తరపున రీక్స్ ఆడుతుంది. ఇది మిగతా క్రికెటర్లు ఒక గుణపాఠం ఉంటుందని  క్రికెట్ ఆస్ట్రేలియా ఇంటిగ్రిటీ యూనిట్ చీఫ్ ఇవాన్ రాయ్ తెలిపారు. ఏ ఫార్మెట్ క్రికెట్ అయినా బెట్టింగ్ అనేది నేరమే కాబట్టి జాతీయ స్థాయి క్రికెటర్లు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు.

Advertisement
Advertisement