'ఫిఫా'లో కొత్త అధ్యాయం.. మహిళ చేతికి పగ్గాలు! | Sakshi
Sakshi News home page

'ఫిఫా'లో కొత్త అధ్యాయం.. మహిళ చేతికి పగ్గాలు!

Published Sat, May 14 2016 10:19 AM

'ఫిఫా'లో కొత్త అధ్యాయం.. మహిళ చేతికి పగ్గాలు! - Sakshi

మెక్సికో: అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య(ఫిఫా) ప్రధాన కార్యదర్శిగా తొలిసారిగా ఓ మహిళ ఎన్నికైంది. ఫిఫా 66వ వార్షిక సమావేశంలో సెనెగలేస్ ఫత్మా సామౌరాను బోర్డు సభ్యులు ఆమెను జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని క్రీడాశాఖ అధ్యక్షుడు గియానీ ఇన్ ఫాంటినో మెక్సికో నగరంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఫుట్ బాల్ సమాఖ్య ప్రస్తుతం అవినీతి మరకలు, కుంభకోణాలతో నిండి ఉందని ఆయన చెప్పారు. వీటి నుంచి బయటపడాలంటే సామౌరాకే ఈ పగ్గాలు ఇవ్వడం సరైన నిర్ణయమని వారు భావించారు.

భారీ బడ్జెట్ ప్రణాళికలు, హ్యూమన్ రీసోర్స్, స్టాఫ్, ఫైనాన్స్ తో పాటు ఆర్గనైజేషన్ ను చక్కగా నిర్వహిస్తుందని ఫిఫా డైరెక్టర్లు ఆశాభావం వ్యక్తంచేశారు. ఫిఫా స్థాయిని మరో మెట్టు పైకి ఎక్కిస్తుందని ఇన్ ఫాంటినో పేర్కొన్నారు. లింగ వివక్ష చూపకుండా నైపుణ్యం ఉన్న వారిని పదవులు వరిస్తాయని, చాలా మంది వ్యక్తులను పర్సనల్ గా కలిసి చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement