ఫిఫా ఎన్నికల్లో మొబైల్స్ నిషేధం! | Sakshi
Sakshi News home page

ఫిఫా ఎన్నికల్లో మొబైల్స్ నిషేధం!

Published Thu, Feb 18 2016 6:52 PM

ఫిఫా ఎన్నికల్లో మొబైల్స్ నిషేధం! - Sakshi

జ్యూరిచ్:వచ్చే వారం జరుగనున్న అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య(ఫిఫా) అధ్యక్ష ఎన్నికలను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగానే మొబైల్ ఫోన్లను, కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఓటింగ్ బూత్లలోకి తీసుకువెళ్లకుండా నిషేధం విధిస్తున్నట్లు ఎలక్ట్రోల్ కమిటీ తెలిపింది. 

అంతకుముందు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఫిఫా సభ్యులు తమ ఓటు ఎవరికి వేశామనే విషయాన్ని మొబైల్స్ ద్వారా చిత్రీకరించి అభ్యర్ధుల వద్ద నిరూపించుకోవాల్సి రావడం నిజంగా సిగ్గచేటని ఫిఫా అధ్యక్షుడిగా పోటీపడుతున్న జిరోమ్ చంపాగ్నీ విమర్శించారు. ఈ తరహా విధానం ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసే  అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ రకమైన చర్యలకు చరమగీతం పాడాలనే ఉద్దేశంతో మొబైల్స్, కెమెరాలు వంటివి పోలింగ్ బూత్లలోకి అనుమతించకుండా ఉండాలని తాము సదరు కమిటీని కోరినట్లు తెలిపారు. దీనికి ఎలక్ట్రోల్ కమిటీ సానుకూలంగా స్పందించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడం సంతోషకర విషయమన్నారు. కాగా, ఫిబ్రవరి 26 వ తేదీన జరిగే ఫిఫా అధ్యక్ష ఎన్నికల్లోఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతుండగా, ఈ ఓటింగ్ లో మొత్తం 209 ఫిఫా సభ్యులు పాల్గొనున్నారు.

 
ప్రపంచ ఫుట్‌బాల్‌ను కనుసైగలతో శాసించి గతేడాది ఐదోసారి ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికైన సెప్ బ్లాటర్ ను అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో అతనిపై ఎనిమిదేళ్ల సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఏడాది వ్యవధిలోనే ఫిఫా అధ్యక్ష ఎన్నికలు అనివార్యమయ్యాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement