కెనడాతో హోరాహోరీ పోరు తప్పదు: కోచ్‌ జీషాన్‌ అలీ | Sakshi
Sakshi News home page

కెనడాతో హోరాహోరీ పోరు తప్పదు: కోచ్‌ జీషాన్‌ అలీ

Published Thu, Sep 14 2017 12:44 AM

Fighting Horror with Canada : Coach Jishan Ali

ఎడ్మంటన్‌ (కెనడా): ఇండోర్‌ కోర్టుల్లో అత్యుత్తమ ప్రదర్శన చేయవచ్చని భారత డేవిస్‌ కప్‌ కోచ్‌ జీషాన్‌ అలీ తెలిపారు. అసాధారణ గాలి, ఎండ బెడద ఉండకపోవడంతో ఇండోర్‌ కోర్టుల్లో నాణ్యమైన ఆట సాధ్యమవుతుందని చెప్పారు. కెనడాతో రేపటి నుంచి జరిగే డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ ప్లే–ఆఫ్‌ పోరులో భారత జట్టు కెనడాతో తలపడుతుంది.

‘ఇండోర్స్‌లో ఆడటం యూకీ బాంబ్రీలాంటి ఆటగాళ్లకు బాగా కలిసొస్తుంది. గతంలో న్యూజిలాండ్‌తో ఇండోర్‌ కోర్టుల్లో జరిగిన మ్యాచ్‌ల్లో అతను అద్భుతంగా ఆడాడు. మొత్తానికి భారత్, కెనడా జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పదు’ అని జీషాన్‌ అన్నారు.  
 

Advertisement
Advertisement