Sakshi News home page

'నిజాయితీతో కూడిన తొలి నిర్ణయం'

Published Tue, Jul 14 2015 9:50 PM

'నిజాయితీతో కూడిన తొలి నిర్ణయం'

లండన్: చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పై జట్లపై రెండేళ్ల నిషేధం విధించడాన్నిఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ సమర్ధించాడు. ఇది భారత్ క్రికెట్ లో నిజాయితీతో కూడిన తొలి నిర్ణయంగా పేర్కొన్నాడు.  ఈ నిర్ణయం  బీసీసీఐకి సిగ్గుచేటని ఎద్దేవా చేశాడు. ఆ రెండు జట్లపై రెండేళ్ల నిషేధం కాదు.. పూర్తిగా నిషేధిస్తే మరింత బాగుండేదన్నాడు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్లో కోర్టులు జోక్యం చేసుకోవడంతోనే బీసీసీఐ వైఫల్యం కనబడుతోందన్నాడు.


మంగళవారం చెన్నై, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తూ సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రాజేంద్ర మాల్ లోధా సారథ్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ తీర్పు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచే తీర్పు అమల్లోకి వస్తుందని వస్తుందని ప్రకటించింది.



 చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ భాగస్వామి రాజ్ కుంద్రాపై జీవితకాల నిషేధం విధించింది. వీరిద్దరూ క్రికెట్ సంబంధిత వ్యవహారాల్లో పాల్గొనకుండా నిషేధం పెట్టింది. మేయప్పన్, కుంద్రా బెట్టింగ్ వ్యవహారాలతో బీసీసీఐ, ఐపీఎల్ తో పాటు క్రికెట్ కు చెడ్డ పేరు వచ్చిందని లోధా కమిటీ పేర్కొంది.

Advertisement
Advertisement